Breaking News

కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం

Published on Tue, 12/23/2025 - 06:02

సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం(2026–27)లో దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్ల పెంపు కోసం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) దరఖాస్తులు ఆహ్వానించింది. అనుమతుల కోసం ఈ నెల 29 నుంచి ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్‌ ఎల్‌.రాఘవ్‌ సోమవారం అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, డీఎంఈలకు లేఖ రాశారు. వచ్చే నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని లేఖలో స్పష్టం చేశారు. ఎన్‌ఎంసీ అధికారిక వెబ్‌పోర్టల్‌ ద్వారా వచ్చిన ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, అదనపు సీట్ల పెంపుపై 2023లో ఎన్‌ఎంసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ)– మినిమమ్‌ స్టాండర్డ్‌ రిక్వైర్‌మెంట్‌(ఎంఎస్‌ఆర్‌) మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్‌ సీట్ల నిష్పత్తి ప్రాతిపదికన అనుమతులు లభిస్తాయి. అదేవిధంగా కళాశాలల్లో గరిష్టంగా 150 సీట్లు దాటకూడదని అప్పట్లో షరతు విధించారు. ఈ నిబంధనలను 2026–27 విద్యా 
సంవత్సరానికి నిలుపుదల చేసినట్టు ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.

వచ్చే ఏడాది లేనట్టే
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌కు కట్టబెడుతోంది. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే అన్ని కళాశాలల్లో తరగతులు ప్రారంభమై ఉండాలి. అయితే, చంద్రబాబు నిర్ణయాలతో తరగతులు ప్రారంభం కాలేదు. 2026–27 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 28తో కళాశాలలు ప్రారంభించేందుకు దరఖాస్తు గడువు ముగియనుంది.

ఇదిలా ఉండగా తొలి దశలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు వైద్య శాఖ టెండర్లు పిలిచింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు ముగిసే నాటికి టెండర్‌ ప్రక్రియ ముగిసే అవకాశం లేదు. ఈ లెక్కన వచ్చే విద్యా సంవత్సరం కూడా వైద్య కళాశాలలు అందుబాటులోకి రావు. ఇప్పటికే చంద్రబాబు చేసిన కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్‌ సీట్లు, 2025–26లో 1,750 కలిపి మొత్తం 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)