Breaking News

ఆప్కాబ్‌కు 60 ఏళ్లు 

Published on Thu, 08/03/2023 - 04:14

సాక్షి, అమరావతి: సహకార బ్యాంకింగ్‌ రంగంలో దేశంలోనే అగ్రగామిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌) 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా రా­ష్ట్రం­లోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ఆప్కాబ్‌ కృషి చేస్తోంది. పీఏసీఎస్‌లు స్వ­యం సమృద్ధి సాధించేందుకు ఆర్థిక చేయూ­త అందిస్తోంది. ఈ నెల 4వ తేదీన జరగనున్న వజ్రో­త్సవ వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. 

రూ.లక్ష కోట్ల వ్యాపారం 
1963 ఆగస్టు 4న ఏర్పడిన ఆప్కాబ్‌ 1966లో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి షెడ్యూల్డ్‌ బ్యాంకుగా గుర్తింపు పొందింది. దీని పరిధిలో 18 శాఖలు ఉండగా.. ఆప్కాబ్‌ పర్యవేక్షణలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ)ల పరిధిలో 425 బ్రాంచ్‌లు, 1,995 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఆప్కాబ్‌ ఆధునిక సాంకేతికతను సంతరించుకుంది.

డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కూడా కోర్‌ బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2018–19 నాటికి రూ.13,322 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ఉన్న ఆప్కాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో ఏకంగా రూ.36,732 కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించింది. రూ.251 కోట్ల లాభాలను ఆర్జించింది. సహకార వ్యవస్థ ద్వారా దేశంలోనే తొలిసారి రూ.లక్ష కోట్ల వ్యాపారంతో గ్రామీణ సహకార వ్యవస్థలో స్వర్ణయుగానికి నాంది పలికింది.

నాలుగేళ్లలో వరుసగా రెండు సార్లు నాఫ్‌స్కాబ్‌ ద్వారా జాతీయ స్థాయిలో నంబర్‌–1 సహకార బ్యాంక్‌గా గుర్తింపు పొందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగంలో ఇండియాలోనే బెస్ట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌గా ఆప్కాబ్‌ బీఎఫ్‌ఎస్‌ఐ ద్వారా అవార్డు అందుకుంది. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బ్యాంక్‌ నూతన లోగో, పోస్టల్‌ స్టాంప్‌తో పాటు విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనుంది.

రైతు సేవలో 60 ఏళ్లు  
ఆప్కాబ్‌ రైతుల సేవలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బ్యాంక్‌ సిబ్బంది, పాలకవర్గ సభ్యులకు అభినందనలు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సహకార రంగం సీఏం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో బలోపేతమైంది. రికార్డుస్థాయి వ్యాపారంతో నష్టాల నుంచి గట్టెక్కి లాభాలను ఆర్జిస్తోంది.  
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)