Breaking News

4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత

Published on Sat, 12/28/2024 - 05:07

హనుమకొండ: ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ) బ్రాంచీలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్‌ చైర్మన్‌ కె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తెలంగాణలోని హనుమకొండలో  ఏపీజీవీబీ ప్రధాన కార్యాలయంలో  విలేకరులతో మాట్లా­డుతూ కేంద్రం నిబంధనల మేరకు తెలంగాణలోని ఏపీజీవీబీ బ్రాంచీలను టీజీబీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. 
ఈ దృష్ట్యా ఈ నెల 28 నుంచి 31 వరకు ఏపీగ్రామీణ వికాస బ్యాంక్‌ సేవలు నిలిపివేయనున్నట్లు వివరించారు. అయితే అత్యవసరాల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10 వేల వరకు విత్‌ డ్రా చేసుకునే అవకాశాన్ని ఖాతా దారులకు కల్పిస్తున్నామన్నా రు. వరంగల్‌ ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్న తమ బ్యాంకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 771 బ్రాంచీలు కలిగి ఉందన్నారు. 

ఇందులో తెలంగాణలోని 493 బ్రాంచీలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లోకి విలీనం చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా 278 బ్రాంచీలు అదే రాష్ట్రంలో ఏపీజీవీబీ పేరిట కొనసాగుతాయన్నారు. విలీనం నేపథ్యంలో తెలంగాణలో ఏపీజీవీబీ ఏటీఎంలు, నెట్‌ బ్యాంకింగ్, యూపీఐతో పాటు ఇతర బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. 

దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఖాతాదారులు సహకరించాలని ఆయన కోరారు. 2025 జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా సేవలు పునరుద్ధరిస్తామన్నారు. బ్రాంచీల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)