Breaking News

రూ.12,771 కోట్ల విద్యుత్‌ చార్జీలపై బహిరంగ విచారణ

Published on Thu, 10/30/2025 - 05:27

సాక్షి, అమరావతి: ‘మాకు ఓట్లేయండి... అధికారం ఇవ్వండి, పాలన చేతికొస్తే విద్యుత్‌ చార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం...’ అంటూ ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు కూటమి పార్టీల నేతలు. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల నడ్డి విరిచేలా చార్జీల భారం మోపుతున్నారు. ఓవైపు ‘సూపర్‌ సిక్స్‌’ అంటూ హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు విద్యుత్‌ చార్జీల పేరుతో బాదుతోంది. 

తాజాగా రూ.12,771 కోట్ల వడ్డనకు తయారైంది. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్‌ రూ.7,790.16 కోట్లు,సీపీడీసీఎల్‌ రూ.1,935.29 కోట్లు, ఎస్పీడీసీఎల్‌ రూ.3,046.51 కోట్లు చొప్పున లోటులో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించిన పిటిషన్లలో వెల్లడించాయి. 

ఈ మొత్తాన్ని విద్యుత్‌ బిల్లుల్లో కలిపి విధించి, వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కమిషన్‌ను కోరాయి. డిస్కంల పిటిషన్లను విచారణకు స్వీకరించిన కమిషన్‌... ప్రజలు తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు నవంబర్‌ 18వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలులోని కోర్టు హాలులో బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. 

ఆది నుంచే...
కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల భారం వేసి విద్యుత్‌ చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టింది. అందులో గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదికి... అంటే 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. 

ఇందులో ఇటీవల రూ.1,863.64 కోట్లకు అనుమతి లభించింది. వసూలు చేసిన దానిలో రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయమని ఏపీఈఆర్‌సీ చెప్పింది. ఈ లెక్కన ప్రజలపై ఇప్పటివరకు రూ.17,349 కోట్ల మేరకు చార్జీల భారం వేసినట్లైంది. ఇది చాలదన్నట్లు మరో పిడుగు పడనుంది. డిస్కంలు అడుగుతున్న రూ.12,771.96 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ ప్రజల పైనే వేయాల్సి ఉంటుంది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)