Breaking News

ఎవరినడిగి విద్యుత్‌ చార్జీలు పెంచారు?

Published on Wed, 01/08/2025 - 06:09

సాక్షి, అమరావతి: ‘రూ.15,485 కోట్ల విద్యుత్‌ చార్జీలను ఎవరినడిగి పెంచారు? కనీసం ప్రజా­భి­ప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు’ అని ప్రతిపక్ష పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభు­త్వాన్ని నిలదీశారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదికలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మంగళవారం బహిరంగ విచారణ చేపట్టింది. 

మండలి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ ఠాగూర్‌ రామ్‌సింగ్, సభ్యుడు పీవీఆర్‌ రెడ్డి విజ­యవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఉద­య­ం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అభిప్రాయాలు సేకరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభిప్రాయాలు తీసుకున్నారు. 

ప్రజలపై మోపు­తున్న అదనపు విద్యుత్‌ భారాలకు వ్యతి­రేకంగా, ట్రూ అప్, సర్దుబాటు చార్జీలను రద్దు చే­యా­­లని, స్మార్ట్‌ మీటర్లను పెట్టవద్దని ప్రభు­త్వాన్ని డిమాండ్‌ చేస్తూ.. బహిరంగ విచారణ జరుగు­తున్న వేదిక వద్ద వివిధ రాజకీయ పార్టీలతో­పాటు వినియోగ­దారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస­రావు మాట్లా­డుతూ.. విద్యుత్‌ చార్జీలను తగ్గిస్తామ­ని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా భారం మోపిందన్నారు.

గత ప్రభుత్వం చేసిన మంచిని కొనసాగించాలి
విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి కూట­మి ప్రభుత్వం మాటతప్పి నమ్మక ద్రోహం చే­సిందని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూ­రావు అన్నారు.  గత ప్రభుత్వం ఎ­స్సీ, ఎస్టీలకు, వృత్తిదారులకు ఉచిత, సబ్సిడీ వి­ద్యుత్‌ ఇవ్వడం మంచిపని అని..దానిని కూ­ట­మి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. ‘షా­ర్ట్‌ టెర్మ్‌’ పేరుతో రూ.వేల కోట్ల అవినీతి జరు­గుతోందని, దీనిపై విచారణ చేయాలన్నా­రు.

సౌర విద్యుత్‌పై జీఓ ఏదీ..?
గత ప్రభుత్వ తప్పులు వెతకడం అనసర­మని ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ వేణుగోపాలరావు అన్నారు. సౌర విద్యుత్‌ను ఒడిసిపట్టుకుంటామనిప్రకటనలు చేయడం తప్ప ఇంతవరకూ కూటమి ప్రభు­త్వం జీఓ జారీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శీర్షాసనం చేసి ఆయన నిరసన  తెలిపారు.

ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ
మాకు ఓటేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చి­న తరువాత విద్యుత్‌ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచమని, తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీఇచ్చి ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని వైఎస్సార్‌­సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.15,485 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజ­లపైమోపుతున్నారన్నారు. పెంచిన చార్జీ­లు రద్దు చేసి, ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు వెంటనే ఉపసంహరించాలని ఏపీఈఆర్‌సీని కోరి­నట్లు ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌ తెలిపారు. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)