ఆ లెక్కలూ చెప్పాల్సిందే   

Published on Sun, 06/30/2024 - 03:30

సాక్షి, అమరావతి: విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసే కొనుగోళ్ల విషయంలో ఇకపై అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ డిస్కంలు తాము పరికరాలను కొనే ముందు, లేదా ఆ తర్వాత టెండర్‌ వివరాలను ఏపీఈఆర్‌సీకి పంపిస్తున్నాయి. కానీ ఆ టెండర్‌తో కొంటున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, ఇతర సామాగ్రి వంటి ధరలను విడివిడిగా వెల్లడించడం లేదు. ఇకపై ప్రతి పరికరానికి సంబంధించి ధరల జాబితాను మండలికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఈ మేరకు విద్యుత్‌ పంపిణీ, సేకరణ, ప్రసార ప్రణాళికలపై ఏపీఈఆర్‌సీ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా 2024–25 నుంచి 2028–29 (5వ నియంత్రణ కాలం) వరకూ, 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకూ విద్యుత్‌ ప్రణాళికలను డిస్కంలు, ఏపీ ట్రాన్స్‌కో ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి. వాటిపై విచారణ జరిపిన మండలి ప్రతిపాదనల్లో చాలావరకు తిరస్కరించింది. కొన్నిటికి మాత్రమే అనుమతినిచ్చింది. మరికొన్నిటిపై మరింత సమాచారం కావాలని అడిగింది. అందులో వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్ల అంశం ఒకటి. 

రివాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. అలాగే  వినియోగదారులకు స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అదీగాక ఇందుకు అయ్యే ఖర్చును డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ఏపీఈఆర్‌సీ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే జగనన్న కాలనీల విద్యుద్దీకరణకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. 

అయితే, తాను ఆమోదించిన విలువల కంటే డిస్కంలు లెక్కల్లో చూపించిన వ్యయం ఎక్కువ అని గుర్తించిన ఏపీఈఆర్‌సీ తాజా ఆర్డర్‌లో గతంలో ఆమోదించిన విలువలకే ఓకే చెప్పింది. అలాగే విద్యుత్‌ కొనుగోళ్ల అంచనాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున.. దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)