Breaking News

విద్యుత్‌ వాహనాలదే భవిష్యత్‌! 

Published on Mon, 07/10/2023 - 04:35

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో 22 వేల విద్యుత్‌ వాహనాలుండగా.. 2034 నాటికి ఆ సంఖ్య 10.56 లక్షలకు చేరుకోనుందని రాష్ట్ర విద్యుత్‌ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) వెల్లడించింది. 2024–25లో 52,334 టూ వీలర్, 6,951 త్రీ వీలర్, 9,318 ఫోర్‌ వీలర్, 239 గూడ్స్, 133 విద్యుత్‌ బస్సులు రోడ్లెక్కుతాయని పేర్కొంది.

అంటే మొత్తం వాహనాల సంఖ్య 68,975కు పెరుగుతుంది. 2034 నాటికి 10,56,617 విద్యుత్‌ వాహనాలను ప్రజలు వినియోగిస్తారని వెల్లడించింది. ఈవీల సంఖ్యతో పాటు వాటి చార్జింగ్‌కు వాడే విద్యుత్‌ వినియోగం కూడా భారీగా పెరగనుంది. 2022లో 16 మిలియన్‌ యూనిట్లుగా ఉన్న వినియోగం.. 2034 నాటికి 677 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని ఏపీఈఆర్‌సీ పేర్కొంది.  

‘ఈవీలకు’ ప్రభుత్వ ప్రోత్సాహం.. 
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తోంది. డౌన్‌ పేమెంట్‌ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈవీలు కొనుగోలుచేసిన వారికి రాయితీలు కూడా వస్తాయని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 9 శాతం వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంది.

రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర చోట్ల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు 4 వేల ప్రాంతాలను ఇప్పటికే గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్‌ అయ్యేలా వీటిని అందుబాటులోకి తెస్తోంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)