Breaking News

జగన్‌ సర్కారు పూర్తి స్వేచ్ఛనిచ్చింది

Published on Thu, 10/31/2024 - 03:29

‘ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్చేచ్ఛనిచ్చింది. అందువల్లనే గత ఐదేళ్లలో అనేక లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగాం. 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేయగలిగాం’ అని మండలి చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. 2019 అక్టోబర్‌ 30న ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏపీఈఆర్‌సీ విజయాలు, ఎదురైన అవరోధాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక 

ఇంటర్వ్యూలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 
⇒ ఐదేళ్లలో విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాం. విద్యుత్‌ ప్రమాదాలు జరిగినప్పుడు అందులో డిస్కం తప్పిదం ఉన్నా లేకున్నా కూడా బాధితులకు పరిహారం అందేలా నిబంధనలు రూపొందించాం. 

⇒ మూడు గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంస్థ (రెస్కో)ల వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసి.. వాటిని డిస్కంల్లో విలీనం చెయ్యాలనే సాహసోపేత ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లింపులు ఆలస్యమైతే డిస్కంలు సర్‌ఛార్జీ వసూలు చేసుకునే అవకాశం కల్పించడమనేది దేశంలో మరెక్కడా లేదు.  

⇒ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా అందించే ఆలోచనలో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని ముందుకు తీసుకెళ్లాం. వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. 

⇒ వచ్చే ఐదేళ్లు విద్యుత్‌ సంస్థల బలోపేతానికి, కొత్త సబ్‌స్టేషన్లు, లైన్ల నిర్మాణానికి జాప్యం లేకుండా అనుమతులిచ్చాం. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు లక్ష్యాలను చేరలేకపోతే వాటి స్థిర చార్జీలలోనే కోత ఉండేది. పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం వాటికి పెనాల్టీలూ వేస్తున్నాం. ప్రతి ఏటా గడువులోగా రిటైల్‌ సరఫరా ధరల ఉత్తర్వులు విడుదల చేశాం. 

⇒ ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఇప్పటివరకు అదనపు సర్‌చార్జీ ప్రతిపాదనలను ఆమోదించలేదు. రైస్‌ మిల్లులు, పల్వరైజర్‌ పరిశ్రమలకు 150 హెచ్‌పీ లోడు వరకు ఎల్‌టీ టారిఫ్‌ ద్వారా విద్యుత్‌ వాడుకొనే అవకాశం కల్పించాం. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు అవకాశమిచ్చాం. విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల పెన్షన్‌ ప్రయోజనాల పరిరక్షణకు పెన్షన్‌ ట్రస్ట్‌లకు నిర్దేశిత మొత్తాలను నిరీ్ణత సమయంలో ఖచ్చితంగా జమ చేయాలని ఆదేశించాం. 

⇒ అవసరం మేరకు బహిరంగ మార్కెట్‌లో అతి తక్కువ ధరకు దొరికే విద్యుత్‌ను సేకరించేలా చేశాం. తద్వారా 2020–21లో దాదాపు రూ.4,700 కోట్లు ట్రూ డౌన్‌ చేసి ఆ మొత్తాన్ని చరిత్రలో తొలిసారిగా వినియోగదారులకు బిల్లుల్లో వెనక్కి ఇప్పించాం. మనం రూపొందించిన పునరుద్ధరణీయ ఇంధన విధానం నమూనా నిబంధనలు దేశానికి ఆదర్శమయ్యాయి. వినియోగదారులకు సమాచారంలో పారదర్శకతను పెంచాం. 

⇒ గృహ విద్యుత్‌ వినియోగదారుల మూడు కేటగిరీలని ఒకే గ్రూపు చేయడం ద్వారా బిల్లుల భారం తగ్గించాం. ఆదాయ పన్ను చెల్లింపుదారు అనే నిబంధన తొలగించి ప్రతి రైతును ఉచిత విద్యుత్‌ కేటగిరీ కిందకు తెచ్చాం. గృహ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిస్కంలు చేసిన సింగల్‌ పాయింట్‌ బిల్లింగ్‌ ప్రతిపాదనలను తిరస్కరించాం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)