Breaking News

బ్యాంకులకు వెనక్కి వస్తున్న రూ.2 వేల నోట్లు.. బడా బాబులవే

Published on Tue, 08/15/2023 - 09:42

సాక్షి, అమరావతి:  క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా కేంద్రప్రభుత్వం రూ.2 వేల నోటును మే 19న చెలా­మణిలోంచి ఉపసంహరించింది. సెప్టెంబరు 30 లోగా ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. దీంతో రూ.2 వేల నోట్లు ఉన్న వారందరూ వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి, చిన్న నోట్లు తీసుకుంటున్నారు. ఇలా నోట్లను మార్చు­కుంటున్న వారిలో అత్యధికులు బడా బాబులే. సామాన్యుల నుంచి వస్తున్న నోట్లు చాలా తక్కు­వని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రైవేటు బ్యాంకులు, మరికొన్ని చిన్న బ్యాంకుల్లో డిపా­జిట్‌ అవుతున్న నోట్లలో 90 శాతానికి పైగా వ్యా­పారుల నుంచే వస్తున్నాయని వెల్లడించాయి. సిటీ యూనియన్‌ బ్యాంక్‌లో రూ.380 కోట్ల విలు­వైన రూ.2 వేల నోట్లు డిపాజిట్‌ అయితే.. అందులో 90 శాతంపైన వ్యాపారవేత్తలవేనని ఆ బ్యాంకు అధి­కారులు తెలిపారు. అదే పెద్ద బ్యాంకుల్లో వస్తున్న డిపాజిట్లలో 50 శాతం పైన ధనవంతులవే. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో రూ.3,589 కోట్ల విలు­వైన నోట్లు వెనక్కి రాగా అందులో 40 శాతం పైన, యూ­కో బ్యాంకులో రూ.3,471 కోట్లు డిపాజిట్‌ అయితే అందులో 58 శాతం వ్యాపారవర్గాల నుంచే వచ్చినట్లు పేర్కొన్నారు.

2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు నగదు కొరత రాకుండా రూ.2 వేల నోటును కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని సంవత్సరా­లుగా రూ.2 వేల నోటు చెలామణి తగ్గడంతో వీటిని వెనక్కి తీసుకుంటున్నారు. సెప్టెంబర్‌ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవడానికి ఆర్‌బీఐ అనుమతించింది. బ్యాంకులకు చేరిన నోట్లను తిరిగి వెనక్కి ఇవ్వవొద్దని బ్యాంకులను ఆదేశించింది. దేశంలో  మొత్తం రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉండేవి. వాటి ఉపసంహరణ అనంతరం జూలై 31 నాటికి 88 శాతం నోట్లు అంటే రూ.3.14 లక్షల కోట్లు వెనక్కి వచ్చి­నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

అత్య­ధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు రూ.14,000 కోట్లు విలువైన నోట్లు వచ్చాయి. పెద్ద మొత్తంలో నోట్లు వెనక్కి రావడంతో బ్యాంకుల వద్ద డిపాజిట్ల విలువ భారీగా పెరిగిపోతోంది. దీంతో బ్యాంకుల వద్ద నగదు లభ్యతను తగ్గించడానికి ఇంక్రిమెంటల్‌ క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (ఐసీఆర్‌ఆర్‌)ను 10 శాతం కేటాయించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. బ్యాంకుల వద్ద ఒక్కసారిగా డిపాజిట్లు పెరిగిన సమయంలో తాత్కాలికంగా ఐసీఆర్‌ఆర్‌ను ఆర్‌బీఐ వినియోగిస్తుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)