Breaking News

ఎన్నికల వేళాపేదల సంక్షేమం

Published on Fri, 08/23/2024 - 06:00

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో కూడా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ద్వారా పేదల సంక్షేమానికి, వారి అభివృద్ధికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఈ విషయాన్ని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(కాగ్‌) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు సంబంధించి వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్‌ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక రంగానికి రూ.37, 699.55 కోట్ల వ్యయం చేసి టాప్‌లో నిలవగా.. ఉత్తరప్రదేశ్‌ రూ.32,800.46 కోట్ల వ్యయం చేసి రెండో స్థానంలో నిలిచింది.  

సామాజిక రంగ వ్యయం అంటే.. 
సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్‌బీఐ పరిగణిస్తాయి. 

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి ముందుగానే.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో నవరత్నాల సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఎన్నికల సమయంలో సైతం పేదలు నష్టపోకుండా పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేసింది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)