Breaking News

మూలధన వ్యయంలో ఏపీ టాప్‌

Published on Wed, 08/09/2023 - 03:54

సాక్షి, అమరావతి: ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధనం వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రి­ల్‌ నుంచి జూన్‌ వరకు మూలధన వ్యయంపై కాగ్‌ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్‌లో మూలధన వ్య­యం కేటా­యింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 40.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్‌ గణాంకాలు తెలిపాయి.

దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో ఇంత మేర వ్యయం చేయలేదని కాగ్‌ గణాంకాలు పేర్కొ­న్నా­యి. పలు రాష్ట్రా­లు బడ్జెట్‌­లో మూ­లధన వ్య­యం కేటాయింపుల్లో ఎంత మే­ర ఖర్చు చేశా­య­నే అంశా­న్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక కూడా వెల్లడించింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రం­లోనూ చేయలేదని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. బడ్జెట్‌లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లోనే ఏకంగా 29.70 శాతం వ్యయం చేసిందని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి కాగ్‌ గణాంకాలు కూడా మూల«­దన వ్యయంలో ఆంధ్రప్రదేశ్‌ మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉ­న్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభు­త్వం బడ్జె­ట్‌­లో మూలధన వ్యయం కింద రూ.31,061 కోట్లు కేటాయింపులు చేయగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.12,669 కోట్లు వ్యయం చేసిందని, ఇది కేటాయింపుల్లో 40.79 శాతమని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదే­శ్‌ తరువాత మూలధన కేటాయింపుల్లో ఎ­క్కువ వ్యయం చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర ఉన్నాయి. మూలధన వ్యయం అంటే నేరు­గా ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)