Breaking News

గత ఆర్థిక ఏడాదిలో పండ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం

Published on Sun, 12/22/2024 - 05:32

సాక్షి, అమరావతి: రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే పంటల దిగుబడి ఎంతగా పెరుగుతుందో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ధాన్యం, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలకూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రాధాన్యతనిచి్చ, అడుగడుగునా రైతుకు అండదండగా నిలిచింది. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. పండ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 

2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, దేశంలో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై నివేదికను విడుదల చేసింది. గత ఆరి్థక ఏడాదిలో దేశంలో మొత్తం తలసరి పండ్ల ఉత్పత్తి 80 కిలోలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 333 కిలోలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2023–24లో ఆంధ్రప్రదేశ్‌ తలసరి కూరగాయల ఉత్పత్తి 119 కిలోలుందని తెలిపింది. 

గత దశాబ్ద కాలంలో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 7 కిలోలు, కూరగాయల ఉత్పత్తి 12 కిలోలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2013–14లో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 73 కిలోలుండగా 2023–24లో 80 కిలోలకు,  కూరగాయల ఉత్పత్తి 135 కిలోల నుంచి 147 కిలోలకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. 

దేశంలో మొత్తం ఒక వ్యక్తి సంవత్సరానికి పండ్లు, కూరగాయలు 146 కిలోలు తీసుకోవాలని సాధారణ సిపా­ర్సు ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి సంవత్సరానికి పండ్లు, కూరయలు కలిపి 227 కిలోలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పంట కోత అనంతరం, నిల్వ, గ్రేడింగ్, రవాణా, ప్యాకేజింగ్‌లో 30 నుంచి 35 శాతం తగ్గుతోందని, ఇది మొత్తం వినియోగంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)