Breaking News

మీ రాతల్లోనే ‘వెనుకబాటు’

Published on Mon, 09/04/2023 - 04:29

సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు తన కళ్లకు ‘పచ్చ’కామెర్లు కమ్మాయని మరోసారి నిరూ­పించుకున్నారు. అందుకే జాతీయ రహదా­రుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉన్న వాస్తవం ఈనాడు కళ్లకు కనిపించడంలేదు. ‘జాతీయ రహదారుల పనుల్లో వెనుకబాటు’ అంటూ ఓ అసత్య కథనం ప్రచురించి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నించింది.

జాతీయ రహదారుల నిర్మాణం, అందుకోసం వేగంగా భూసేకరణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మొదటిస్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన విషయన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో నత్తనడకన సాగిన ప్రాజెక్టులను కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సత్వరం పూర్తిచేసి.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలనూ శరవేగంగా సాగేలా చూస్తోంది. ఉదా..

♦ విజయవాడలో బెంజిసర్కిల్‌ మొదటి ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులను చంద్రబాబు ప్రభు­త్వం పూర్తిచేయలేకపోయింది. వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రెండు ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసింది.
♦  విజయవాడ బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసింది. విజయవాడ పశ్చిమ బైపాస్‌ పనులను శరవేగంగా పూర్తిచేస్తోంది.
♦   అలాగే ఎన్‌హెచ్‌–216 నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటోంది. 
♦    కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ రహదారిని 2015–16, 2016–17లో మంజూరు చేసింది. ఒంగోలు నుంచి కత్తిపూడి వరకూ తీర ప్రాంతాన్ని ఆనుకుని 374.83 కి.మీ. పొడవున రూ.3,826.84 కోట్లతో జాతీయ రహదారి నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం మొత్తం 10 ప్యాకేజీలుగా ఈ పనులను విభజించారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఒక్క ప్యాకేజీ పనులనే పూర్తిచేయగలిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు ప్యాకేజీల పనులను పూర్తిచేశారు. మొత్తంగా ఏడు ప్యాకేజీల రూపంలో 360కి.మీ మేర రహదారిని నిర్మించారు. మిగిలిన మూడు ప్యాకేజీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
♦  కాకినాడ బైపాస్‌ కింద తిమ్మాపురం–గురజాన­పల్లి జాతీయ రహదారి పనులు 95శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి ఆ రహదారి నిర్మాణం పూర్తవుతుంది.
♦  పాసర్లపూడి–దిండి సెక్షన్‌లో రహదారి నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో భూసేకరణ పూర్తిచేయలేకపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఆ భూసేకరణ ప్రక్రియను పూర్తిచేసి పనులు ప్రారంభించింది. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మే నాటికి ఈ రహదారి నిర్మాణం పూర్తిచేస్తారు. 
♦  ఇక రేపల్లె, ఈపురుపాలెం సెక్షన్‌లో రహదారి పనుల కోసం భూసేకరణ ప్రక్రియను కూడా టీడీపీ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దానిని పూర్తిచేయడమే కాక 90శాతం వరకు నిర్మాణం పనులు పూర్తిచేసింది. ఈ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తికానున్నాయి. ఆర్‌ఓబీతో రహదారిని అనుసంధానించడంతోపాటు టోల్‌ప్లాజా, రెస్ట్‌ ఏరియా ఏర్పాటు పనులు మాత్రమే పెండింగులో ఉంటాయి. వాటిని కూడా వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయనుంది. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)