Breaking News

హడ్కో ద్వారా ఏపీ టిడ్కో రూ.4,451 కోట్ల అప్పు

Published on Fri, 01/09/2026 - 04:44

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ గ్యారెంటీల అప్పులకు అంతులేకుండా పోతోంది. బడ్జెట్‌ అప్పులు మంగళవారాల్లో చేస్తుండగా.. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రతీనెలా అప్పులు చేస్తోంది. తాజాగా.. హడ్కో ద్వారా ఏపీ టిడ్కో రూ.4,451 కోట్లు అప్పు తీసుకునేందుకు బాబు సర్కారు గ్యారెంటీ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు ఆర్థిక శాఖ నుంచి కంఫర్ట్‌ లెటర్‌ను అందించడానికి సర్కారు అంగీకరించింది. అసలు, వడ్డీకి హామీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ హామీ చెల్లుబాటవుతుంది.

వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం వ్యవధి మొదలైన షరతులు వంటి వివరాలతో పాటు అసలుతో పాటు వడ్డీ తిరిగి చెల్లింపు షెడ్యూల్‌ను సమర్పించాల్సిందిగా ఏపీ టిడ్కోకు ప్రభుత్వం సూచించింది. రుణ సంస్థకు బాధ్యతలను చెల్లించడంలో టిడ్కో విఫలమైన సందర్భంలో మాత్రమే ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. రుణ డీడ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆర్థిక శాఖ అ«దీకృత అధికారి సంతకం చేస్తారు. మొత్తం రుణంపై ఏపీ టిడ్కో ఐదు శాతం గ్యారెంటీ కమీషన్‌ను చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రాజధాని పేరుతో హడ్కో నుంచి  రూ.11,000 కోట్లు అప్పుచేసింది. ఇప్పుడు చేస్తున్న ఈ రూ.4,451 కోట్లతో కలిపితే చంద్రబాబు సర్కారు హడ్కో నుంచి చేసిన మొత్తం అప్పు రూ.15,451 కోట్లకు చేరుతోంది.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)