Breaking News

అనకాపల్లిలో టిడ్కో గృహాలు: సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌

Published on Thu, 01/04/2024 - 12:53

సాక్షి, అనకాపల్లి: సత్యనారయణపురంలో 2,744 టిడ్కో గృహ సముదాయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. కాగా, 27 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తమకు సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..పేదవాడి సొంటితి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. పేదలకు శాశ్వత నివాసం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.50 లక్షల మందికి టిడ్కో ఇల్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య రంగంలో విప్లాత్మకమైన మార్పులు తెచ్చారని అన్నారు. 

మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ఈ సారి మీ సొంత ఇంట్లో చేసుకోవాలని టిడ్కో ఇళ్లు పూర్తి చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలుపుకున్నారు. లబ్ధిదారులకు రిజస్ట్రేసన్లు ఉచితంగా చేయిస్తున్నారు. కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. జగనన్న కాలనీల ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని కామెంట్స్‌ చేశారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)