Breaking News

ఏపీ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

Published on Fri, 10/24/2025 - 05:34

సాక్షి, అమరావతి: రెగ్యులర్‌ అభ్యర్థులతో పాటు ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఏపీ టెట్‌ (అక్టోబర్‌ 2025) షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు శుక్రవారం నుంచి నవంబర్‌ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును  http://cse.ap.gov.in ద్వారా చెల్లించాలని సూచించింది. నవంబర్‌ 25న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తారని, డిసెంబర్‌ 3 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోలని సూచించింది. 

డిసెంబర్‌ 10 నుంచి రోజూ రెండు పూటలా ఉదయం 9 నుంచి 12 గంటలకు, మ«ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని చెప్పారు.  http://tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌ నుంచి పూర్తి సమాచారం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286ను సంప్రదించవచ్చన్నారు.  

ఆ ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి
టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరని, ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు సైతం నిర్దేశించిందని పేర్కొంది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ, అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్‌ ఉండాలని నిర్దేశించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒకటో తేదీ నాటికి 5 ఏళ్ల లోపు మాత్రమే ఇంకా సర్వీసు మిగిలి ఉన్నవారికి టెట్‌ నుంచి మినహాయింపునిచ్చింది. కాగా, ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నిర్వహణను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)