Breaking News

‘విశ్మకర్మ యోజన’లో ఏపీకి రెండో స్థానం

Published on Mon, 10/07/2024 - 05:42

సాక్షి, అమరావతి: సంప్రదాయ చేతివృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద శిక్షణ, లబ్ధి పొందిన మహిళల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం దక్కింది. మొదటి స్థానంలో కర్ణాటక ఉండగా.. మూడో స్థానంలో గుజరాత్, నాలుగో స్థానంలో జమ్మూకశ్మీర్, ఐదో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర నైపుణ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా 3,03,161 మందికి లబ్ధి 
గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది జూలై వరకు 10 నెలల కాలంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,03,161 మంది చేతివృత్తుల వారికి శిక్షణ, లబ్ధి చేకూరగా.. ఇందులో 50 శాతానికి పైగా (2,74,703 మంది) మహిళలు ఉన్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం కింద 2.41 లక్షల మంది మహిళలు టైలరింగ్‌లో శిక్షణ, లబ్ధి పొందినట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ పథకం కింద వడ్రంగి, పడవల తయారీ, కమ్మరి, ఆయుధాల తయారీ, సుత్తి ఇతర పనిముట్లు తయారీ, 

తాళాల మరమ్మతులు, శిల్ప కళాకారులు, స్వర్ణకారులు, కుమ్మరి, చెప్పులు కుట్టేవారు, తాపీ పనివారు, బుట్ట, చాప, చీపర్ల తయారీ, బొమ్మలు తయారీ, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేపల వలలు తయారు చేసేలాంటి 18 రకాల చేతివృత్తుల వారు నమోదయ్యే అవకాశం కేంద్రం కల్పించింది. ఈ పథకం కింద నమోదైన చేతి వృత్తుల వారికి సర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు కార్డు ఇస్తారు. ఈ గుర్తింపు ద్వారా ఆయా చేతి వృత్తుల వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఆ వృత్తికి సంబంధించి టూల్‌ కిట్స్‌ రాయితీపై అందించడం, స్వయం ఉపాధి పొందేందుకు తొలి విడతలో వ్యాపార వృద్ధికి రూ.1 లక్ష రుణం ఇస్తారు. ఈ రుణం తీర్చిన తరువాత రెండో విడతగా రూ.2 లక్షలు రుణం ఇస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)