Breaking News

మాచర్ల గొర్రె .. ఇక స్పెషలే!

Published on Tue, 07/23/2024 - 05:32

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పల్నాడు ప్రాంతంలో బాగా పెరిగే ‘మాచర్ల గొర్రె’కు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీకి చెందిన ఒంగోలు గిత్త, అశీల్‌ రకం కోడి వంటివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్‌బీఏజీఆర్‌ (నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ యానిమల్‌ జెనెటిక్‌ రిసోర్సెస్‌) ఈ గొర్రెను ఉత్తమ రకం పశువుగా నమోదు చేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాచర్ల రకం గొర్రెలు ఉన్నాయి. 

దేశంలోని ఇతర రకాల గొర్రెలు, పొట్టేళ్లతో పోలిస్తే మాచర్ల గొర్రెలు విభిన్నంగా ఉన్నట్టు ఎన్‌బీఏజీఆర్‌ పేర్కొంది. దీనిపై ప్రత్యేక పరిశోధన చేసిన అనంతరం తాజా గా ఆ సంస్థ వీటిని ఉత్తమ ర­కం పశువులుగా గుర్తించింది. ఈ పరిశోధనలో కర్నాల్‌లోని ఎన్‌బీఏజీఆర్, గన్నవరంలోని ఎనీ్ట­ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి.

స్థానిక పరిస్థితులకు అనుకూలంగా.. 
మాచర్ల గొర్రెలనే గుక్కల జాల అని, గుంటూరు లోకల్‌ గొర్రె అని కూడా పిలుస్తారు. ఏపీలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మాచర్ల గొర్రెల జాతి చక్కగా ఇమిడిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. వీటి మాంసం మిగతా వాటితో పోలిస్తే రుచికరంగా ఉంటుందని వెల్లడించారు.

శరీర బరువు ఏడాదిలో 30 నుంచి 45 కేజీల వరకూ పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖం, కాళ్లపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఉంటాయి. కొన్ని గొర్రెలు ముదురు గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి. మాచర్ల గొర్రెల పోషణ లాభదాయకంగా ఉండటంతో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు దీన్నే వృత్తిగా చేసుకుంటున్నారని వెల్లడించారు. 

రెండో స్థానంలో ఏపీ
» గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పశు సంపద భారీగా పెరిగినట్టు ఎన్‌బీఏజీఆర్‌వెల్లడించింది.
»  ప్రపంచంలో 13.8 % వాటా పశువులతో దేశం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో 23.74% వాటాతో అంటే 17.63 మిలియన్‌ గొర్రెలతో దేశంలోనే
ఏపీ రెండో స్థానంలోఉన్నట్టు స్పష్టం చేసింది.
» వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం లాభసాటిగాఉండటంతో ఎక్కువ మంది రైతులు దీనినే వృత్తిగా ఎంచుకుంటున్నారు. పైగా మాంసం ధర ఎక్కువగా ఉండటం వల్ల మంచి గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)