‘ఉపాధి’ కూలీలకు ముఖ ఆధారిత హాజరు

Published on Mon, 12/01/2025 - 04:38

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో రోజువారీ పనులకు హాజరయ్యే కూలీలకు కూడా ఉద్యోగుల మాదిరి ముఖ ఆధారిత హాజరును నమోదు చేయనున్నారు. ఈ పథకంలో దొంగ మ­స్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో సోమవారం నుంచి అమలు చేయనుంది. ఇందులో మన రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్ర అధికారులు ఇందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ప­నులకు హాజరయ్యే కూలీల నమోదును గ్రామాల్లో పనిచేసే ఫీల్డు అసిస్టెంట్లు లేదా మేట్‌లు రోజువారీగా నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేసుకొని, వారానికి ఒకసారి మండలాఫీసులోని ఉపాధి హా­మీ పథకం విభాగంలో అందజేస్తారు.

ప్రస్తుత ప్రక్రియలో పనులకు హాజరయ్యే కూలీలను గ్రూ­పు ఫొటో తీసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ, మాన్యువల్‌ విధానంలో సమరి్పంచే రోజు వారీ మస్టరు షీట్లలో పేర్కొన్న కూలీల వివరాల మేరకే వేతన బిల్లులు రికార్డు చేస్తున్నారు. ముఖ ఆధారిత హాజరు కోసం ప్ర­త్యేక యాప్‌ ద్వారా పని ప్రదేశంలో ఆయా కూలీల ఫొటో తీసినప్పుడు, అది ఆ వ్యక్తి ఆధార్‌లో ఉన్న ఫొటోతో సరిపోయినప్పుడే అతని హజరు నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండు మూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. 

4 గంటల వ్యవధిలో రోజూ రెండుసార్లు 
క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం అమలుకు ఉద్దేశించి పనిచేసే ఫీల్డు అసిసెంట్లు లేదా మేట్‌ల వద్ద ఉండే మొబైల్‌ యాప్‌లో కూలీలు ఫొటో దిగి తమ రోజు వారీ హాజరు నమోదు చేస్తారు. పని జరిగే ప్రాంతానికి గరిష్టంగా పది మీటర్ల పరిధిలోపు మాత్రమే ముఖ ఆధారిత హాజరు నమోదు చేసేలా కేంద్రం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. ఉదయం 11 గంటల లోపు ఒక విడత.. మరో నాలుగు గంటల తర్వాత రెండో విడత ఈ తరహాలో హాజరు నమోదు చేయనున్నారు. ఇలా హాజరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌ వేతన బిల్లులను అనుమతిస్తుందని అధికార వర్గాలు వివరించాయి.

ఇందులో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసి, ఈకేవైసీ చేపట్టి, దాదాపు పూర్తి చేసింది. కాగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల దాదాపు ఏడున్నర లక్షల కుటుంబాల జాబ్‌ కార్డులు తొలగించిన తర్వాత కూడా రాష్ట్రంలో 64.93 లక్షల కుటుంబాలకు సంబంధించి 1.13 కోట్ల మంది ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు కలిగి ఉన్నారు. సగటున 47 లక్షల కుటుంబాలు సుమారు రూ.7 వేల కోట్ల మేర లబ్ధి పొందుతున్నాయి. దేశ వ్యాప్తంగా 15.50 కోట్ల కుటుంబాలకు సంబంధించి 26.57 కోట్ల మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. 

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)