భద్రత కోసం కాదు.. ఆంక్షల కోసమే

Published on Thu, 06/19/2025 - 06:00

సాక్షి, నరసరావుపేట/పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): ప్రజల భద్రత కోసం పని చేయాల్సిన పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రతి­పక్ష నేతలపై కక్ష తీర్చుకోవడానికే ఉపయోగి­స్తోంది. ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో ఆయనకు భద్రత కలిగించాల్సింది పోయి.. అడుగడుగునా ఆంక్షలు విధించి పర్యటనను విఫలం చేసే కుట్రలో పోలీసు వ్యవస్థ నిమగ్నమ­వ్వడం స్పష్టంగా కనిపిస్తోంది.  

రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వర­రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవా­రం వచ్చిన వైఎస్‌ జగన్‌ను అడ్డుకునేందుకు పోలీ­సులు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రతి దశలో ‘పచ్చ’పాత వైఖరి అవలంబించి విమర్శలపాల­య్యారు. భద్రత పేరుతో ముగ్గురు ఎస్పీలు, ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 554 మంది సిబ్బందిని విధుల్లో నియమించినప్పటికీ, వీరంతా వైఎస్‌ జగన్‌ భద్రత∙కోసం కాకుండా నాయకులు, కార్య­కర్తలు, అభిమానులను ఎక్కడికక్కడ నిలువరి­ంచే­ందుకే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతు­న్నాయి. 

వైఎస్‌ జగన్‌ ఇటీవల పర్యటించిన తెనాలి, పొదిలి, రాప్తాడు పర్యటనలకు ప్రజలు బ్రహ్మారథం పట్టడంతో ఎలాగైనా రెంటపాళ్ల పర్యటనను అడ్డుకో­వా­లని కూటమి ప్రభుత్వం, పోలీసులు కుట్రలు పన్నారు. అనుమతులు ఇవ్వలేమంటూ హైడ్రామా సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విచిత్ర నిబంధనలు అడ్డుచూపి ఆంక్షలు పెట్టారు. మంగళవారం రాత్రి కూడా సత్తెనపల్లిలో పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాస­రావు ప్రెస్‌మీట్‌ పెట్టి అనుమతులపై స్పష్టత లేకుండా మాట్లాడారు. 

మరోవైపు జగన్‌ పర్యటనలో పాల్గొనవద్దంటూ గుంటూరు, పల్నాడు జిల్లా పోలీ­సులు మంగళవారం సాయంత్రం నుంచి పార్టీ నేతలకు నోటీసులు అందజేశారు. ఒకవేళ వెళితే కేసులు బనాయించి అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. రెంటపాళ్లకు ప్రైవేట్‌ వాహనాలు పంపొద్దని, పంపితే సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పో­స్టులు ఏర్పాటు చేసి, బుధవా­రం తెల్లవారు­జాము నుంచే వాహ­నాల తనిఖీలు ప్రారంభించారు. 

మాచర్ల, గుంటూరు, నరసరావు­పేట, అమరావతి మొదలైన ప్రాంతాల నుంచి వస్తున్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనా­లను అడ్డుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీ­లను సైతం పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారుల ఆధార్‌ కార్డులు చెక్‌ చేసి మరీ పంపారు. దీంతో కొంత మంది రోడ్డు మార్గాన్ని వదలి పంట పొలాల మీదుగా ద్విచక్ర వాహనాల్లో రెంటపాళ్లకు చేరుకున్నారు. 

ఆ వీడియోలు సోషల్‌ మీడి­యాలో వైరల్‌ అయ్యాయి. తుదకు విగ్రహావిష్కర­ణకు వస్తున్న బంధువులను సైతం పోలీ­సులు అడ్డుకుంటున్నారని నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు వాపోయారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణలు బారికేడ్లను తొలగించే ప్ర­య­త్నం చేశారు.  గుంటూరు నగరంలోనూ పోలీసులు అదే తీరు ప్రదర్శించారు.   

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)