Breaking News

పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి..  కీలక సూచనలివే!

Published on Sat, 01/21/2023 - 10:11

సాక్షి, అమరావతి: పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ప్రిలిమినరీ పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు మొత్తం 5.03 లక్షలమంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు

అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. అవి.. 
► అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి.  
► అభ్యర్థులను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు. 
► ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు.  
► మొబైల్‌ ఫోన్‌/సెల్యూలార్‌ ఫోన్, ట్యాబ్‌/ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్‌ పరికరాలు/రికార్డింగ్‌ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్‌ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. వాటిని పరీక్షకేంద్రం వద్దకు తీసుకురాకూడదు. వాటిని భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.  
► అభ్యర్థులు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్‌ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలి. 
► హాల్‌టికెట్, బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తీసుకురావాలి.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)