Breaking News

ఉద్యోగం నుంచి తొలగిస్తే.. పురుగుల మందే దిక్కు

Published on Thu, 08/08/2024 - 09:05

పులివెందుల: తమ­ను ఉద్యోగం నుంచి తొలగిస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటూ ఔట్‌సోరి్సంగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఇద్దరు చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన వైఎస్సార్‌ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఔట్‌సోరి్సంగ్‌ పద్ధతిలో నియమితులై పులివెందుల మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న నలుగురిని, సింహాద్రిపురం మార్కెట్‌యార్డులో ముగ్గురిని తొలగించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. 

ఇప్పటికే వారికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్న ఆందోళనతో పులివెందుల మార్కెట్‌యార్డులో అటెండర్‌గా పనిచేస్తున్న అజార్, సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో పురుగుమందు డబ్బాలు, పెట్రోలు తీసుకెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన మీడియాతో అజార్, మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో.. సరైన కారణాలు చూపకుండా ఇప్పటికే అధికారులు తమకు రెండు షోకాజ్‌ నోటీసులు అందజేశారన్నారు.

 ఆఫీసులో రిజిష్టర్‌ను దాచిపెట్టి తాము సంతకాలు పెట్టేందుకు వీలులేకుండా చేస్తున్నారని చెప్పారు. తమకు జీవనాధారం అయిన ఈ ఉద్యోగాలను తీసేస్తే.. ఆత్మహత్యలే శరణ్యమని విలపించారు. దీంతో మార్కెట్‌యార్డు సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ‘మీరు కోర్టును ఆశ్రయించారు కాబట్టి.. కోర్టు ద్వారా వచ్చే నిర్ణయాన్ని బట్టి తాము చర్యలు తీసుకుంటాం’ అని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. దీనిపై సెక్రటరీని వివరణ కోరగా తాము ఎవర్ని విధుల నుంచి తొలగించలేదని తెలిపారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)