విశాఖ: ఒక్క రాంగ్‌కాల్‌ మూల్యం.. రూ.4 కోట్లు!!

Published on Mon, 03/31/2025 - 11:53

అల్లూరి సీతారామరాజు: నగరానికి చెందిన 35 ఏళ్ల మహిళ నాలుగేళ్లుగా అనుభవిస్తున్న నరకానికి తెరపడింది. శ్రీకాళహస్తికి చెందిన బి.అక్షయ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఆమెను రాంగ్‌ కాల్‌ ద్వారా పరిచయం చేసుకుని, ఆపై బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు అరెస్ట్‌ అయ్యాడు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివి.. 2020లో కోవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో అక్షయ్‌ కుమార్‌ పొరపాటున బాధితురాలికి ఫోన్‌ చేశాడు. మొదట్లో ఆమె స్పందించకపోయినా, అతను మెసేజ్‌లు పంపుతూ ఆమె వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నాడు. బలవంతంగా స్నేహం కొనసాగిస్తూ.. మాట్లాడమని ఒత్తిడి చేశాడు. 

ఆమె నిరాకరించడంతో తన వద్ద ఉన్న వాయిస్‌ రికార్డింగ్‌లను ఆమె భర్తకు పంపిస్తానని బెదిరించాడు. అంతేకాదు ఏకంగా రూ.10 లక్షలను సీఎంఆర్‌ సెంట్రల్‌ షాపింగ్‌ మాల్‌లో ఆమె నుంచి తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెను కారులో నగరంలోని హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి, వాటితో ఆమెను నిత్యం బెదిరించడం మొదలుపెట్టాడు. అలా దాదాపు రూ.4 కోట్ల నగదు, 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు. ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు వీడియోలు పంపుతానని బెదిరించడంతో పాటు, ఆమె భర్తపై యాసిడ్‌ దాడి చేస్తానని, పిల్లలను కిడ్నాప్‌ చేస్తానని కూడా బెదిరించాడు. గత వారం నిందితుడు నోవాటెల్‌కు రమ్మని డిమాండ్‌ చేయగా, బాధితురాలు నిరాకరించింది. 

దీంతో మళ్లీ బెదిరింపులకు దిగాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్థితికి చేరుకుంది. చివరకు ఆమె తన భర్త, కుటుంబ సభ్యుల సహాయంతో త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక కారు, మొబైల్‌ ఫోన్, 65 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఆదివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)