Breaking News

పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రగామి 

Published on Sun, 03/17/2024 - 05:22

ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండటంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ రూపాల్లో సాయం అందిస్తుండటంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు.

దేశవ్యాప్తంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలను సోమవారం వెల్లడించింది.   - సాక్షి, అమరావతి

1.81 కోట్ల టన్నులతో మనమే టాప్‌ 
2023–24 ఆర్థిక ఏడాదిలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర 1,42,78,250 టన్నుల పండ్లు ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌ 1,27,02,060 టన్నుల పండ్ల ఉత్పత్తితో మూడో స్థానంలో నిలిచింది. అరటి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచాయి.

బత్తాయి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. నిమ్మ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్‌ నిలిచాయి. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. బొప్పాయి ఉత్పత్తిలో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది.

ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ విస్తీర్ణమే ఉన్నా పండ్ల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రఫ్రదేశ్‌లో పండ్లు సాగు విస్తీర్ణం 7,80,310 హెక్టార్లు ఉండగా.. మహారాష్ట్రలో 8,48,370 హెక్టార్లలో పండ్ల సాగు విస్తీర్ణం ఉంది. 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)