Breaking News

నకిలీ మద్యంతో కల్లు గీత వృత్తి బలి

Published on Sun, 10/19/2025 - 05:40

సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘‘నకిలీ మద్యానికి కల్లు గీత వృత్తి బలి అవుతోంది. ప్రభుత్వ పెద్దల అండతో అధునాతన యంత్రాలతో నకిలీ మద్యం తయారీని పరిశ్రమ తరహాలో నిర్వహించడం అంటే ఇందులో వైఫల్యం ఎవరిది? రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసి డబ్బు సంపాదనే లక్ష్యంగా నకిలీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నా­రు. గంజాయి కంటే ప్రమాదకరమైన స్పిరిట్‌తో మద్యాన్ని తయారు చేస్తున్నవారిపైన, బెల్ట్‌ షాప్‌లలో అమ్మేవారిపైన తక్షణం పీడీ యాక్ట్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

శనివారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో అధ్యక్షుడు వాక రామచంద్రరావు అధ్యక్షతన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఇందులో నరసింహమూర్తి మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న కొందరు రాష్ట్రంలోని తమ­వారి ద్వారా, ఫినాయిల్‌ పేరుతో స్పిరిట్‌ను బస్సుల్లో తరలించి నకిలీ మద్యం తయారు చేయించారని, ఈ దారుణ దందాపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తాటి కల్లు అమ్మకాల­ను టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. కల్లు గీత వృత్తిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశా­రు.     

ఎక్స్‌గ్రేషియా రద్దుతో ప్రభుత్వం అన్యాయం చేసింది 
రాష్ట్ర ప్రభుత్వం కిస్తీలు రద్దు చేసి గీత వృత్తిని దెబ్బతీసిందని, ఎక్స్‌గ్రేషియా ఎత్తివేసి గీత కార్మికులకు అన్యాయం చేసిందని వాక రామచంద్రరావు మండిపడ్డారు. ఎన్నికల వాగ్దా­నాలు నమ్మి  ఓట్లు వేసినందుకు కూటమి ప్ర­భు­త్వ­ం గీత కార్మికులను దగా చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచి్చన 16 నెలల కాలంలో కల్లు అమ్మ­కాలు లేక గీత కార్మికులు వృత్తిని కొనసాగించలేక ఉన్న ఊరు, కన్నతల్లి, భార్యా పిల్లలను వది­లేసి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశా­రు.  

వృత్తి రక్షణకు మరో పోరాటం 
గీత వృత్తిని పరిశ్రమగా అభివృద్ధి చేయాలని, కల్లుకు మార్కెటింగ్‌ కల్పించాలని, వృత్తి ఆధునికీకరణకు నిపుణుల కమిటీ వేయాలనే తదితర డిమా­ండ్లపై రాష్ట్రవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ నెల 23 నుంచి నవంబరు 18 వరకు 27 రోజుల ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించింది. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర దేవుడు, కామన మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)