Breaking News

AP: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కార్‌ మొండి వైఖరి

Published on Fri, 10/17/2025 - 20:41

విజయవాడ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  పలు డిమాండ్లతో విద్యుత్‌ యాజమాన్యంతో చర్చలకు వెళ్లిన జేఏసీకి ఇంకా స్పష్టత రాలేదు.  విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కార్‌ మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. వారి హామీలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. 

ప్రధానంగా కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అంశంపై విద్యుత్‌ యాజమాన్యం ఎటు తేల్చకపోవడంతో ఈరోజు ఒక దఫాలో జరిగిన చర్చలు పలప్రదం కాలేదు. దాంతో  విద్యుత్‌ ఉద్యోగులు సమ్మెబాట పట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే విద్యుత్‌ యాజమాన్యం.. మళ్లీ జేఏసీని చర్చలకు పిలిచింది. 

అయితే చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది.  విద్యుత్‌ సౌధాలో జేఏసీ నేతలు తమ నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అంశం తప్పించి మిగతావి అడగాలని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాంతో జేఏసీ కూడా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అంశంపై క్లారిటీ ఇవ్వాలని అంటుంది. 

మళ్లీ కొనసాగుతున్న చర్చలు
ఈరోజు(శుక్రవారం, అక్టోబర్‌ 17వ తేదీ) విద్యుత్‌ యాజమాన్యంతో జరిగిన చర్చల విఫలమై.. ఉద్యోగులు సమ్మె బాటకు సిద్ధమైన తరుణంలో వెంటనే మళ్లీ చర్చలకు పిలిచారు. మరోసారి జేఏసీతో విద్యుత్‌ యాజమాన్యం చర్చలు జరుపుతుంది.  ప్రధానంగా జేఏసీ చైర్మన్‌, కన్వీనర్‌ను మాత్రమే పిలిచి విద్యుత్‌ యాజమాన్యం చర్చలు జరుపుతున్నారు. మిగతా నేతలంతా విద్యుత్‌ యాజమాన్యం వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)