Breaking News

రూ.30 వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు?

Published on Mon, 09/22/2025 - 05:18

సాక్షి, అమరావతి: ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లి­స్తారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలోని రెవిన్యూ భవన్‌లో ఆదివారం జరిగిన జేఏసీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బకాయి­లు చెల్లించకపోవడంవల్ల రిటైరైన తర్వాత గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్ మెంట్‌ మొత్తాలు తీసుకో­కుండానే చాలామంది మ­ర­ణిస్తున్నారని తెలి­పారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదు­ర్కొంటున్న ఆర్థిక, ఆర్థి­కేతర సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

ఈహెచ్‌ఎస్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ఉద్యో­గు­లు, పెన్షనర్లు చికిత్స పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, సరెండర్‌ లీవ్‌ డబ్బులు కూడా విడుదల కావడంలేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తంచేశారు. దసరా పండుగ కానుకగా కనీసం డీఏలు, పెన్షనర్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని.. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో లేవనెత్తిన అంశాలు పరిష్కారమయ్యేలా చూడా­ల­న్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి­నా ఇప్ప­టివరకు జీఓ జారీచేయకపోవడం సరికాదన్నారు.  

ఉద్యమాలకు వెనుకాడం.. 
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ.. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జీతాల పెంపు, వారికి ప్రభుత్వ పథకాల వర్తింపు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు. ప్రభు­త్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. బకాయిలు, డీఏలు, పీఆర్సీ నియా­మకం, పదోన్నతులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 

ఇక నవంబరు 30లోపు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతికి అనుబంధంగా ఉన్న సంఘాలు రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలు పూర్తిచేసి, జిల్లా పర్య­టనలు నిర్వహించి, స్థానిక కమిటీల్లో ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే, భవిష్యత్తులో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ ఇచ్చే పిలుపులకు సంఘాలు సిద్ధంగా ఉండాలని బొప్పరాజు కోరారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)