Breaking News

ఇంటర్‌ విద్యలో కొత్త సిలబస్‌

Published on Fri, 06/05/2026 - 04:53

సాక్షి, అమరావతి: ఇంటర్మిడియట్‌ విద్యకు సంబంధించి 2026–27 విద్యా సంవత్సరంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. సెకండియర్‌ విద్యార్థులకు కొత్త సిలబస్‌ అమల్లోకి రానుంది. మొత్తం 14 ప్రధాన సబ్జెక్టుల్లో సవరించిన కొత్త సిలబస్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. అలాగే గత విద్యా సంవత్సరం ఇంటర్‌ మొదటి ఏడాదిలో కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు అప్‌డేటెడ్‌ సిలబస్‌ను అమల్లోకి తేనున్నారు.

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, జియోగ్రఫీ వంటి మైనర్‌ సబ్జెక్టుల సిలబస్‌ను కూడా సవరించారు. ఇప్పటికే కొత్త సిలబస్‌కు అనుగుణంగా క్వశ్చన్‌ పేపర్‌ డిజైన్లు, మోడల్‌ పేపర్లను ఇంటర్‌ విద్యా శాఖ ఖరారు చేసింది. కాగా, ఈనెల 12 నుంచి కాలేజీలు తెరుచుకోనున్న నేపథ్యంలో ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌ బాషా గురువారం ఆర్జేడీలతో పాటు జిల్లాల అధికారులు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి విద్యార్థుల పెండింగ్‌ వివరాలను అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కాలేజీల్లో 10% అడ్మిషన్ల పెంపు చేపట్టాలన్నారు. కాంట్రాక్ట్, గెస్ట్‌ ఫ్యాకల్టీ సర్వీస్‌ పునరుద్ధరణ పూర్తిగా వారు బోధించే సబ్జెక్టుల్లో పబ్లిక్‌ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగానే ఉంటుందన్నారు. 

Videos

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

Photos

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)