అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
Andhra Pradesh: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
Published on Mon, 02/23/2026 - 05:53
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు (ఐపీఈ–2026) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మంగళవారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్ష కేంద్రాల్లో 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్లోకి అనుమతించేది లేదని ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఈ క్రమంలో విద్యార్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పరీక్షల సందేహాలపై ఇంటర్మీడియెట్ విద్యామండలి కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1800–425–1531(టోల్ ఫ్రీ) నంబర్ను సంప్రదించవచ్చు.
Tags : 1