Breaking News

‘ఆదా’య వృద్ధికి దోహదమే..

Published on Mon, 09/22/2025 - 04:51

సాక్షి, అమరావతి: జీఎస్‌టీ సవరణ ఆమోదించదగ్గ పరిణామమేనని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందన్న వాదనలో వాస్తవం లేదని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక స్పష్టం చేసింది. ఏటా రూ.8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందన్న రాష్ట్ర ప్రభుత్వ అంచనాను తప్పుబట్టింది. వినిమయ శక్తి పెరిగి రూ.16,759 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తేల్చి చెప్పింది.

సవరించిన జీఎస్‌టీ శ్లాబులు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదివారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోలను విడుదల చేసింది. సోమవారం నుంచి అన్ని వస్తువుల అమ్మకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు స్పష్టంచేశారు. 

స్వల్పకాలిక హెచ్చుతగ్గులు సహజం  
జీఎస్‌టీ సవరణ ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందన్న అంశంపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక విడుదల చేసింది. స్వల్పకాలికంగా ఒకటి, రెండు నెలలు ఆదాయంలో హెచ్చు తగ్గులున్నా... ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలుశక్తి పెరిగి దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ.16,759 కోట్ల ఆదాయం సమకూరుతుందని వెల్లడించింది. 

2017లో జీఎస్‌టీ అమ­లు చేసినప్పుడు కూడా ఆదాయం తగ్గుతుందని రాష్ట్రం అంచనా వేసినా, ఆ తర్వాత ఆదాయం భారీ­గా పెరగడమే దీనికి ఉదాహరణగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం 2024–25 సంవత్సరంలో రూ.33,677 కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా 28 శాతం శ్లాబు నుంచి 42.65శాతం ఆదాయం 
అంటే రూ.14,366.61 కోట్లు సమకూరింది.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)