Breaking News

జగన్‌ హయాంలో ఏపీకి అత్యధిక డ్రోన్లు

Published on Tue, 12/03/2024 - 05:40

సాక్షి, అమరావతి: గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డ్రోన్స్‌ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. గత ఆర్థిక ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధికంగా డ్రోన్స్‌ మంజూరు చేయించారు. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నమో డ్రోన్‌ దీదీ పథకం కింద స్వయం సహాయక సంఘాలకు మూడేళ్ల కాలంలో 15 వేల డ్రోన్స్‌ సమకూర్చడం ద్వారా స్థిరమైన వ్యాపారం, జీవనోపాధికి మద్దతు అందించాలని గత ఆర్థిక ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఇందులో భాగంగా డ్రోన్‌ దీదీ పథకం కింద  దేశవ్యాప్తంగా 1,094 డ్రోన్స్‌ను స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేసింది. వీటిలో ఏపీకి 108 డ్రోన్స్‌ను సమకూర్చింది. దేశంలో మొత్తం డ్రోన్స్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం 500 డ్రోన్స్‌ సమకూర్చగా.. ఏపీకి అత్యధికంగా 96 డ్రోన్స్‌ ఇచ్చింది. ఏపీ తరువాత కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు ఎక్కువ డ్రోన్స్‌ మంజూరయ్యాయి. 

గుర్తింపు పొందిన రిమోట్‌ పైలట్‌ శిక్షణ కేంద్రాల ద్వారా స్వయం సహాయక సంఘాలకు 15 రోజుల పాటు శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రధానంగా పురుగు మందుల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. మహిళా రైతులకు శిక్షణలో డ్రోన్‌ ఫ్లైయింగ్, డ్రోన్‌ నియమాలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ వినియోగం శిక్షణలో డ్రోన్‌ తయారీ సంస్థలు,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థల నిపుణులు ఉంటారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)