Breaking News

మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Published on Tue, 03/21/2023 - 08:05

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను తమ సర్వీస్‌ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆమో­దం తెలిపారు. ప్రస్తుతం ఈ చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే ఉపయోగించుకోవా­లని నిబంధన ఉంది. దీనిని సవరించి.. మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వ­త­రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత సోమవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను కలి­శారు. ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ సమస్యను సీఎం దృష్టికి తీసుకురాగా.. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీచర్‌ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి 

అలాగే ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నైజేషన్‌ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరగా.. దీనిపైనా సాను­కూలంగా స్పందించిన సీఎం ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధి­కారులను ఆదేశించారు. అనంతరం ఎంవీ రామచంద్రారెడ్డి మా­ట్లా­డుతూ.. తాము కోరిన వెంటనే సీఎం జగన్‌ మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)