Breaking News

ఉపాధి కూలీలకు డబ్బులివ్వని సర్కారు

Published on Sun, 03/16/2025 - 06:08

సాక్షి, అమరావతి: గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు 70 రోజులుగా వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ ఏడాది జనవరి 9 తర్వాత పనులు చేసిన కూలీలకు ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. 65 రోజులపాటు చేసిన పనులకు సంబంధించి దాదాపు రూ.664 కోట్లను కూలీలకు చెల్లించాల్సి ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవ­సాయ పనులు దొరకని రోజుల్లో పేదలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతుంటారు. వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది పేదలు ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు.  

74 లక్షల మందికి ఈ పనులే ఆధారం 
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో  57.87 లక్షల కుటుంబాలకు చెందిన 97.35 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో ఏటా 46 నుంచి 47 లక్షల కుటుంబాలు వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 46.51 లక్షల కుటుంబాలకు చెందిన 74 లక్షల మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. వీరిలో 60 శాతానికి పైగా మహిళలే. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో సగం కుటుంబాలు ఉపాధి హామీ పథకంపైనే ఆధారపడుతున్నాయి. ఎందరికో జీవనోపాధి కలి్పస్తున్న ఈ పథకం అమలులో కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందో అర్థమవుతోందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.  

ఉద్యోగులకూ వేతనాలు కరువే..?
15వ తేదీ ముగిసినా 5వేల మందికి అందని జీతాలు
సాక్షి, అమరావతి: నెలలో సగం రోజులు గడి­చి­పోయినా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభు­త్వం వేతనాలు చెల్లించలేదు. ఉపాధి హామీ పథకం నిర్వహణ కోసం మండల స్థాయిలో కంప్యూటర్‌ సెంటర్లు(ఎంసీసీ) నుంచి మొదలై జిల్లా స్థాయిలో డ్వామా కార్యాల­యాలు, రాష్ట్ర స్థాయిలోని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఫిక్సిడ్‌ టెన్యూర్‌ ఎంప్లాయీస్‌(ఎఫ్‌టీఈ) కేటగిరీలో కలిపి ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తుంటారు.

ఎంసీసీల్లో పని చేసే ఎఫ్‌టీఈ కేటగిరీ ఉద్యోగుల్లో టెక్నికల్‌ అసి­స్టెంట్ల(టీఏ) నుంచి రాష్ట్ర స్థాయి కార్యా­లయంలో పనిచేసే వివిధ స్థాయి ఎఫ్‌టీఈ ఉద్యోగుల వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను మార్చి 15వ తేదీ సాయంత్రం వరకు చెల్లించలేదు. ఆయా ఉద్యో­గులకు చాలా తక్కువ మొత్తంలో వేతనాలు ఉన్నాయని, వాటిని సక్రమంగా చెల్లించకపోతే ఎలా జీవించాలని ఉద్యోగ 
సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు.  

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి..
నాలుగు వారాలు పని చేశాం. రోజూ ఆటోలో బాడిగ రూ.20 ఇచ్చి వెళ్లాం. మేం చేసిన పనికి రావాల్సిన కూలి కోసం రోజూ మేట్‌లను అడుగుతున్నాం. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. – పసుపులేటి బ్రహ్మయ్య, ఉపాధి కూలీ, చాగంటివారిపాలెం, పల్నాడు జిల్లా

రూపాయి కూడా ఇవ్వడం లేదు 
రోజూ ఉపాధి పనికి వస్తున్నాం. ఐదారు వారాల నుంచి ఒక్క రూపాయి కూడా అందడం లేదు. పనిచేస్తున్న దగ్గర కనీసం నీడ సదుపాయం కూడా లేదు. సకాలంలో వేతనాలు అందజేసి, పని దగ్గర మౌలిక వసతులు కల్పించాలి.  
– జి.విజయలక్ష్మి, ఉపాధి కూలీ, శ్యామసుందరపురం, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా

పైసా ఇవ్వలేదు 
ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గతంలో వారానికి ఓసారి డబ్బు పడేది. ఇప్పుడు రెండు నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. పిల్లల్ని ఎలా పోషించాలో తెలియడం లేదు.   – కుమార్, ఉపాధి కూలీ,     చిట్టమూరు, తిరుపతి జిల్లా  

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)