Breaking News

గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు

Published on Fri, 07/28/2023 - 08:02

సాక్షి, అమరావతి:  తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. 

అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్  పేరిట జీవో విడుదలయ్యింది. 

అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 

అంతా సిద్ధం
తాడేపల్లి:
 గోదావరి వరద ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్ధ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వెల్లడించారు. ‘‘ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక‌ కొనసాగుతోంది. బ్యారేజ్ నుంచి 13.63 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. గోదావరి వరద ప్రభావం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎఎస్ఆర్ , కోనసీమ, ఏలూరు జిల్లాలలో ఎక్కువగా ఉంది.

అల్లూరి జిల్లాలో ఐదు మండలాలలో 155 గ్రామాలు, ఏలూరు జిల్లాలోని మూడు మండలాలలో 49 గ్రామాలు, కోనసీమలో 20 మండలాలలో 141 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలలో 47 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, 17 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం‌ ఉంది.  వరద ప్రభావిత సహాయ చర్యల‌కోసం సీఎం జగన్‌ రూ. 12 కోట్లు మంజూరు చేశారు. గోదావరి వరద ప్రభావిత మండలాలలో, జిల్లాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఈ రోజు సాయంత్రానికి భద్రాచలంలో గోదావర వరద పెరిగే అవకాశాలున్నాయి. ఈనెల 30 నుంచి గోదావరి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాం. వరద సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది. వరద సహాయక చర్యల కోసం మూడు NDRF, నాలుగు SDRF బృందాలు పనిచేస్తున్నాయి అని వెల్లడించారాయన. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)