Breaking News

మంత్రికి చెప్పారుగా.. జీతాలు వస్తాయిలే!

Published on Sat, 11/22/2025 - 04:56

సాక్షి, అమరావతి: జీతాలిప్పించండి మహోప్రబో... అని మంత్రి లోకేశ్‌కు మొరపెట్టుకున్నందుకు వారికి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా మూడునెలల వేతనాలను ఆపేసింది. 1,500 మందికిపైగా పార్ట్‌టైమ్‌ టీచర్లు వేతనాల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న వీరికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సక్రమంగా వేతనాలు రావడంలేదు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని భావించిన పార్ట్‌టైమ్‌ టీచర్లు.. జీతం ఇప్పించాలని ఆయన్ని కోరుతూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అంతే.. ప్రభుత్వం వారిపై పగబట్టినట్టుగా మూడు నెలలకుపైగా వేతనాలు నిలిపేసింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి జీతాలు ఇవ్వలేదు. 

పేరుకే పార్ట్‌టైమ్‌... పని చేసేది ఫుల్‌టైమ్‌ 
పేరుకే పార్ట్‌టైమ్‌ అయినా ఫుల్‌టైమ్‌ పనిచేస్తున్నామని, వేతనాలు రాక అవస్థలు పడుతున్నామని కొద్దిరోజుల కిందట అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాల పార్ట్‌టైమ్‌ టీచర్లు ఒక కీలక అధికారిని కలిసి మొరపెట్టుకున్నారు. మీరు పార్ట్‌టైమ్‌ టీచర్లు మాత్రమే. ప్రభుత్వం జీతం ఇచ్చినప్పుడే తీసుకోవాలి... అని ఆ అధికారి కటువుగా బదులిచ్చారు. మంత్రి లోకేశ్‌కు ట్వీట్‌ చేశారుగా.. జీతాలు వచ్చినప్పుడే వస్తాయిలే.. అని వెటకారంగా చెప్పారు. ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తి­స్తున్నామని, ఆ తర్వాత స్టడీ అవర్స్‌కు తప్పనిసరిగా ఉండాల్సి వస్తోందని పార్ట్‌టైమ్‌ టీచర్లు తెలిపారు.

విద్యార్థుల మొత్తం బాధ్యత, రికార్డుల పర్యవేక్షణతోపాటు రెగ్యులర్‌ స్టాఫ్‌ చేసే ప్రతి పనిని తాము కూడా చేస్తున్నప్పటికీ వేతనాలు నెలల తరబడి ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. ఆగస్టు నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో తాము కుటుంబపోషణకు ఇతర ఖర్చులకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలివ్వాలని, శ్రమ దోపిడీని అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.    

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)