Breaking News

ప్రస్తుత నీటి వాడకానికి రక్షణ కల్పించాలి

Published on Fri, 01/23/2026 - 05:37

సాక్షి, అమరావతి: కృష్ణాబేసిన్‌ లోపల, వెలుపలి ప్రాంతాల్లోని ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం తాము చేస్తున్న నీటివినియోగానికి రక్షణ కల్పించాలని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ట్రిబ్యునళ్ల సాధారణ నిబంధనలు, హెల్సి­ంకీ నియమాలు, బెర్లిన్‌ నియమాలు, జాతీయ జలవిధానం, అంతర్‌రాష్ట్ర నదీజల వివాదాల చట్టం, ఏపీ పునర్విభజన చట్టం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ట్రిబ్యునల్‌ ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌గుప్తా, న్యాయ­వాది ఉమాపతి వాదనలు వినిపించారు. 

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పునః­పంపిణీపై జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలో ఎస్‌.తాళపత్ర, జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ట్రిబ్యునల్‌ ఎదుట ఏపీ తరఫున తుది వాదనల్ని వీరు రెండోరోజు గురువారం  కొనసాగించారు. బేసిన్‌ వెలుపల, బయ­ట అనే తేడా లేకుండా ప్రస్తుత వినియోగానికి రక్షణ కల్పించాల్సిందేనని ట్రిబ్యునల్‌ అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కావేరి ట్రిబ్యునల్‌లో చర్చ తర్వాత ప్రస్తుత వినియోగానికి రక్షణ కల్పిస్తూ తీర్పువచ్చిందని గుర్తుచేశారు. 

ప్రత్యామ్నాయ జలవనరులున్నా కృష్ణా జలాలను వాడుకుంటున్న ఏపీలోని బేసిన్‌ వెలుపలి ప్రాంతాలతో పోలిస్తే.. అత్య­ంత నీటి ఆవశ్యకత ఉన్న తెలంగాణలోని బేసిన్‌ లోపలి ప్రాంతాలే నీటికేటాయింపులకు అర్హత కలిగి ఉంటాయని తెలంగాణ చేస్తున్న వాదనను ట్రిబ్యునల్‌ గుర్తుచేయగా.. బేసిన్‌ వెలుపలి ప్రాంతాలకు ప్ర­త్యా­మ్నాయ జలవనరులు ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమని జైదీప్‌గుప్తా స్పష్టం చేశా­రు. రాయలసీమలో సరిపడ నీటిలభ్యత ఉందని పేర్కొంటూ ఆ ప్రాంతానికి కేటాయించిన జ­లా­­లను తెలంగాణకు పునఃకేటాయించాలని ఆ రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చాలని కోరారు. 

కృష్ణాజలాలను ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు పంపిణీ చేస్తూ కృష్ణా ట్రిబ్యునల్‌–2 గతంలో ఇచ్చిన తుది నివేదికకు తెలంగాణ సైతం కట్టుబడి ఉండాల్సిందేనని.. లేకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీకి తిరిగి కేటాయింపులు చేయాల్సి ఉంటుందని వాదించారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలని కోరారు. తుది వాదనలను శుక్రవారం కూడా జైదీప్‌గుప్తా, ఉమాపతి కొనసాగించనున్నారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)