Breaking News

Fact Check: అసలే గుడ్డి.. ఆపై బాబు పొరలు

Published on Fri, 03/15/2024 - 04:35

కళ్లకు చంద్రబాబు పొరలు కమ్మేసిన గుడ్డి రామోజీ మరోసారి బట్టలిప్పేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను జగన్‌ సర్కారు మోసం చేసిందంటూ చేతికొచ్చింది రాసి చిందులు తొక్కారు. తాను కట్టుకున్న కోట దాటి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ సీఎం జగన్‌ సృష్టించిన ఉద్యోగాల విప్లవం ఈ బధిరుడికి కనిపించేది. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ను బయటకు తీశారన్న అక్కసుతో జగన్‌ ఏలుబడిలో ఉద్యోగాల కల్ప­న లేదంటూ పచ్చి అవాస్తవాలను అచ్చు వేశారు. పదే పదే అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రామోజీ ఒకసారి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఉద్యోగాలు కల్పించలేదంటూ రాగం తీస్తే అప్పుడు ఎవరు ఎవరి కాలర్‌ పట్టుకుని నిలదీస్తారో తెలుస్తుంది.

ఈ రాతలపై మండిపడుతున్న యువత ఎవరి కాలర్‌ పట్టుకోవాలో ఇప్పటికే నిర్ణయించేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత జగన్‌ సర్కారుది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10–11 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తారు. దేశ చరిత్రలో ఒకేసారి కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించడం, వెంటనే భర్తీ చేయడం జరగనేలేదు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3 శాతం ఉంటే ఇప్పుడు వైఎస్‌.జగన్‌ హయాంలో కేవలం 4.1 శాతమే. 

ఈ గణాంకాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెలువరించినవి. 2014–19 మధ్య చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 34,108.  చంద్రబాబు దిగిపోయే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,123 మాత్రమే. ఇప్పుడు వైఎస్‌.జగన్‌ హయాంలో శాశ్వత ఉద్యోగులు,  కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్, ఇతర ఉద్యోగులు మొత్తం కలిపి 6,38,087 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు గాలికి వదిలేస్తే, వైఎస్‌.జగన్‌ సర్కారు 53,466 ఉద్యోగాలను భర్తీ చేసింది.  

నైపుణ్య శిక్షణ మీ బాబు భక్షణే 
అసలు ఈనాడు రామోజీ ఏడుపు అంతా చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌పై విచారణ చేపట్టడమేనని అక్కసుతో రాసిన ఈ కథనం చెప్పకనే చెబుతోంది. స్కిల్‌ పేరుతో చంద్రబాబు దోపిడీ అంతా ఇంతా కాదు. స్కిల్‌ పేరుతో కోట్లాది రూపాయల నిధులు తన ఇంటికి మళ్లించేశారు. కానీ వైఎస్‌.జగన్‌ ప్రభుత్వం 175 శాసనసభ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి ఉండే విధంగా మొత్తం 192 స్కిల్‌ హబ్‌్సను ఏర్పాటు చేసింది. ఇక్కడ లెవెల్‌–4 లోపు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి తక్కువ కాకుండా మొత్తం 26 స్కిల్‌ కాలేజీలను ఏర్పాటు చేసింది. 

హై ఎండ్‌ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు రాష్ట్ర విద్యార్థులు అందుకునే విధంగా స్కిల్‌ ఇంటర్నేషనల్‌ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం పలు పరిశ్రమలు, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకొంది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్యర్యంలో నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు 14,26,515 మంది యువతకు శిక్షణ ఇచ్చింది.  

అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం
కేంద్రం విడుదల చేసిన ఇండియా 2023 స్కిల్‌ రిపోర్ట్‌ అత్యధిక ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోనే ఆంద్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉందని స్పష్టం చేసింది. సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పన భేష్‌ అని నివేదిక ప్రశంసించింది. ప్లేస్‌మెంట్లలో రూ.2.6 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్కిల్‌ రిపోర్ట్‌ పేర్కొంది. యువతకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందేలా­గా ప్రోత్సహిస్తున్నది సీఎం వైఎస్‌.జగన్‌ మాత్రమే. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)