Breaking News

ఐబీకి దగ్గరగా ఏపీ విద్యా విధానాలు 

Published on Sat, 03/02/2024 - 02:37

సంబేపల్లె: ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తోన్న విద్యా విధానాలు ఇంటర్నేషనల్‌ బాకలారియట్‌ (ఐబీ)కి దగ్గరగా ఉన్నాయని ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్‌ అమల్లోకి రానున్న దృష్ట్యా అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఐబీ కరిక్యులం రూపకల్పన సభ్యులు వెండిగీన్‌ (అమెరికా) ఎరిక్‌ బాబర్‌ (ఇంగ్లండ్‌) సందర్శించారు. వీరు నాడు–నేడు ద్వారా సమకూరిన తరగతి గదులు, ఇతర మౌలిక వసతుల గురించి ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలో అమలవుతోన్న విద్యా విధానం, విద్యార్థుల అభ్యసన విధానంలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్స్‌ ఎలా దోహదపడుతున్నాయనేది పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌లను చూసి వాటిని ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకున్నారు. బైజూస్‌ ట్యాబ్స్, ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద పథకాల ద్వారా తాము ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నామో విద్యార్థులు వీరికి వివరించారు. అంతర్జాతీయ ప్రతినిధులు పాఠశాలలోని జగనన్న గోరుముద్దను తిన్నారు.

పాఠశాలలో డిజిటల్‌ విద్య, ద్విభాష పాఠ్యపుస్తకాలు, లైబ్రరీ, యూనిఫామ్, భౌతిక, జీవనశాస్త్ర ప్రయోగశాలను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రధానోపాధ్యాయుడిని అభినందించారు. ఎస్‌సీఈఆర్‌టీ అధ్యాపకుడు గిరిబాబు యాదవ్‌ మాట్లాడుతూ 2035కి పదోతరగతికి, 2037కి 12వ తరగతికి ఐబీ సిలబస్‌ను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు ఐబీ కరిక్యులం అంతర్జాతీయ ప్రతినిధులు ఏపీలోని పలు పాఠశాలలను సందర్శిస్తున్నారని చెప్పారు. 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు