Breaking News

రేపట్నుంచే ఏపీలో టెట్‌ పరీక్షలు

Published on Mon, 02/26/2024 - 20:11

సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 6వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో టెట్‌ పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది. 

పొద్దున 9గం.30. నుంచి 12గం. దాకా.. అలాగే మధ్యాహ్నాం 2గం.30ని. నుంచి సాయంత్రం 5గం. దాకా మరో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. టెట్‌ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉండనుంది. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం గమనార్హం. తెలంగాణాలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఈ పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్‌ అధికారుల్ని నియమించారు. పరీక్షా కేంద్రాల తనిఖీలకి  29 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. గర్బిణీ అభ్యర్ధులకి సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇక.. విద్యాశాఖ ముందస్తుగానే రిలీజ్‌ చేసిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ.. 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)