Breaking News

ఈవీఎంల వినియోగంలో సందేహాలను నివృత్తి పర్చిన ఈసీఐఎల్ బృందం

Published on Tue, 03/05/2024 - 19:09

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికల  నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ (EVM Management System-EMS 2.0)  వాటి వినియోగంలో నోడల్ అధికారులు ఎదుర్కొంటున్న సందేహాలను, సమస్యలను హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్‌ ఈసీఐఎల్‌ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య నివృత్తి చేశారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెండో రౌండ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ నేతృత్వంలో జరిగి ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ప్రత్యక్షంగాను ,అరుణాచల ప్రదేశ్,  ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు చెందిన అధికారులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 9న జరిగిన మొదటి రౌండ్ శిక్షణా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణ మరియు వాటి వినియోగంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈవీఎం నోడల్ అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఈసీఐఎల్‌ అధికారుల బృందం సమగ్ర అవగాహన కల్పించడం జరిగింది. అయితే క్షేత్ర స్థాయిలో ఈవీఎంల వినియోగంలో అధికారులకు, సాంకేతిక సహాయకులకు ఎదురైన  సమస్యలు, సందేహాలను నివృత్తి పర్చేందుకు నెల రోజుల తదుపరి రెండో రౌండ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈవీఎంల నిర్వహణలో సాదారణంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మరొసారి ఈ  శిక్షణా కార్యక్రమంలో ఈసీఐఎల్‌ అధికారుల బృందం వివరించింది. అదే విధంగా జిల్లాల వారీగా ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు అడిగిన పలు సందేహాలకు, సమస్యలకు ఈసీఐఎల్‌ అధికారుల బృందం సభ్యులు సీనియర్ డి.జి.ఎం. ఎ.పి.రాజు, ఇంజనీర్ సి జి ఆదిత్య సమగ్రమైన వివరణను ఇచ్చారు. అసిస్టెంట్ సీఈవో పి.తాతబ్బాయ్ తో పాటు అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎం నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు  ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)