Breaking News

ఏపీ ఈఏపీ సెట్‌–2024 షెడ్యూల్‌ విడుదల

Published on Wed, 03/13/2024 - 05:19

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్‌–2024 దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనట్లు సెట్‌ చైర్మన్, జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు చెప్పారు. దరఖాస్తులకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్‌ 15  వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు.

రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 30 వరకూ, రూ.1,000 ఫైన్‌తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్‌తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్‌తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి మే 13–16 వరకూ, అగ్రికల్చర్, ఫార్మసీకి మే 17–19 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

ఏపీలో 47, హైదరాబాద్‌లో 1, సికింద్రాబాద్‌లో 1 చొప్పున ఆన్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మే 7 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పరీక్షకు ప్రొఫెసర్‌ కె.వెంకటరెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వివరాలకు 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)