Breaking News

వైఎస్‌ జగన్‌ను కలిసిన దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం

Published on Wed, 07/29/2026 - 19:02

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఏపీ రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ జారీ చేసిన జీవో నంబర్‌ 396ను రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

జీవో నంబర్‌ 396 దస్తావేజు లేఖరుల ఉపాధికి మరణశాసనంగా మారుతుందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తే దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు తమ ఉపాధితోపాటు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు.

ఈ విధానం వల్ల దస్తావేజు లేఖరులతోపాటు స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. వీరిపై ఆధారపడిన కుటుంబాలను కలుపుకొంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ప్రస్తుతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధికి భద్రత కల్పించాలని కోరారు. తమ వృత్తిని, జీవనోపాధిని పరిరక్షించేలా జీవో నంబర్‌ 396ను తక్షణమే రద్దు చేయాలని, దస్తావేజు లేఖరులు, స్టాంప్‌ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, సహాయకుల ప్రయోజనాలను కాపాడే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంఘం ప్రతినిధులు వివరించిన సమస్యలను వైఎస్‌ జగన్‌ సావధానంగా విన్నారు. దస్తావేజు లేఖరులు, వారిపై ఆధారపడిన ఇతర వర్గాల ఉపాధి పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, సంఘం ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు ఉన్నారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)