Breaking News

ఏపీ కాఫీకి ‘భలే’ డిమాండ్‌

Published on Tue, 09/10/2024 - 04:25

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉంటుండడంతో ఏటేటా ఎగుమతులు పెంచుకుంటూ.. తన సత్తా చాటుకుంటోంది. కాఫీ పంట ఉత్పత్తిలో దేశంలోనే నాలుగో స్థానంలో ఏపీ ఉందని  కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 1,00,963 హెక్టార్లలో కాఫీ సాగవుతుండగా 2022–23 ఆరి్థక సంవత్సరంలో 12,265 మెట్రిక్‌ టన్నుల కాఫీని ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. దేశంలో ఆరు రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లోనే కాఫీ సాగు అవుతోందని, కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు దేశవ్యాప్తంగానూ ఏటేటా పెరుగుతున్నాయని వెల్లడించింది.

దేశంలో  2020–21లో కాఫీ ఉత్పత్తుల ఎగుమతులు విలువ రూ.6,027 కోట్లు ఉండగా 2022–23 నాటికి రూ.9,397 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. భారతీయ కాఫీ రంగం అభివృద్ధికి కాఫీ బోర్డు వాణిజ్య  విభాగం సంపూర్ణ మద్దతు అందిస్తోందని తెలిపింది. ఇంటిగ్రేటెడ్‌ కాఫీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ద్వారా రీఫ్లాంటేషన్‌కు, కాఫీ సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించింది.

కాఫీ సాగు చేసే స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులను ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన కాఫీ రకాలను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎగుమతి మార్కెట్‌లో భారతీయ కాఫీని ప్రోత్సహించేలా చర్యలు చేపడుతుందని పేర్కొంది. సాంకేతిక సహాయం అందించడంతో పాటు, కాఫీ తోటల పెంపకం దారులకు క్షేత్రస్థాయి నిర్వహణ, పద్ధతులపై అవసరమైన శిక్షణను వర్క్‌షాపుల ద్వారా  కాఫీ బోర్డు వాణిజ్య విభాగం అందిస్తున్నదని వివరించింది.  

2022–23 ఆరి్థక సంవత్సరంలో కాఫీ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఇలా
రాష్ట్రం పేరు    విస్తీర్ణం సాగు (హెక్టార్లు)     ఉత్పత్తి (మెట్రిక్‌ టన్నులు) 
కర్ణాటక              2,46,550                          2,48,020 
కేరళ                  85,957                            72,425 
తమిళనాడు       35,685                           18,700 
ఆంధ్రప్రదేశ్‌      1,00,963                        12,265 
ఒడిశా                 4,868                            465 
ఈశాన్య ప్రాంతాలు    5,647                      125 

Videos

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

Photos

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)