Breaking News

AP: కృష్ణాజలాలపై హైలెవల్‌ మీటింగ్‌

Published on Mon, 10/09/2023 - 20:58

సాక్షి, గుంటూరు: కృష్ణాజలాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జలాలపై కేంద్రం తాజా విధివిధానాల జారీ నేపథ్యంలో సోమవారం సాయంత్రం  ఈ సమావేశం నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించారు సీఎం జగన్‌. అంతేకాదు.. సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. 

KWDT-2 తీర్పుద్వారా.. మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైనా ఈ భేటీలో చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని, రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని, ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌ ఉండగా కూడా గెజిట్‌ విడుదలచేశారని అధికారులు ప్రస్తావించారు.

2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా.. దీనికి విరుద్ధంగా  కేంద్రం విధివిధానాలు చేసిందని అధికారులు వివరించారు. దీంతో.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని.. ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ భేటీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ప్రధానికి సీఎం జగన్‌ లేఖ

Videos

DSP ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

ఓటమి భయంతోనే.. చంద్రబాబు అండ్ కో దాడులు

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు దృష్టి..

పచ్చ కుట్ర జోరు.. రూ.600, బిర్యానీ ప్యాకెట్లు.. ఎన్నికల వేళ విద్యార్థులకు ఎర..

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

Photos

+5

అల్లు శిరీష్- నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)