Breaking News

వట్టి వసంతకుమార్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

Published on Sun, 01/29/2023 - 11:02

తాడేపల్లి: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వసంత్ కుమార్ ఆదివారం తెల్లవారు జామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం.

ఆది నుంచి వసంత్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్‌ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ  మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో  పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్‌కుమార్‌ విశాఖలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు.

చదవండి: లోకేష్‌ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)