Breaking News

మంత్రి గారు.. నాకు న్యాయం చేయండి

Published on Thu, 07/10/2025 - 07:29

సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఓ చిరు వ్యాపారి స్నేహితుడైన (టీడీపీ మాజీ కౌన్సిలర్‌) వడ్డీ వ్యాపారి అరాచకానికి బలయ్యాడు. బుధవారం ఉదయం 4.30 సమయంలో తన ఎలక్ట్రిక్‌ షాపులోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితుడే తనను నట్టేట ముంచేశాడంటూ ఆత్మహత్యకు ముందు చిరువ్యాపారి ఇందూరి నాగభూషణరావు రికార్డు చేసిన ఆడియోను మిత్రులకు పంపించాడు.

సాలూరులోని మామిడిపల్లి కూడలిలో ఎలక్ట్రిక్‌ షాపు నడుపుతున్న వ్యాపారి ఇందూరి నాగభూషణరావు పట్టణంలోని డబ్బివీధికి చెందిన వడ్డీ వ్యాపారి డబ్బి కృష్ణారావు వద్ద తన వ్యాపార అవసరాల కోసం రూ.40 లక్షలు అప్పుచేశాడు. ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఎలక్ట్రిక్‌ షాపును వడ్డీ వ్యాపారి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. రూ.కోటి విలువైన షాపును రూ.75 లక్షలకే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. నాగభూషణరావు తీసుకున్న రూ.40 లక్షలు అప్పు మినహాయిస్తే మిగిలిన రూ.35 లక్షలు ఆయన చేతికి ఇవ్వాల్సి ఉండగా, రూ.10 లక్షలు అప్పుగా తిరిగిచ్చాడు. నాగభూషణరావు నుంచి కొనుగోలు చేసుకున్న షాపునే వ్యాపారికి నెలకు రూ.20వేలు అద్దెప్రాతిపదికన తనఖా ఇచ్చాడు.

షాపుకి అద్దె కింద నెలకు రూ.20 వేలు, పది లక్షలకు వడ్డీ రూ.పదివేలు చొప్పున నెలకు ప్రతినెలా రూ.30 వేలు వడ్డీ వ్యాపారి వసూలు చేస్తున్నాడు. తన డబ్బునే ఉంచుకుని, తనకు అప్పుకింద ఇచ్చి వడ్డీ వసూలు చేస్తూ ఆర్థిక కష్టాల్లోకి నెట్టేశాడని, ఎదిరించే ధైర్యంలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆడియోలో పేర్కొన్నారు. నాగభూషణరావుకి భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు సాలూరు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన నాగభూషణరావు జేబులో రాతపూర్వక లేఖ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆలేఖను స్వాధీనం చేసుకున్నారు.

 కుటుంబాన్ని ఆదుకోండి.. 
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని ఉద్దేశించి చిరువ్యాపారి నాగభూషణరావు ఆడియో విడుదల చేశాడు. తన స్నేహితుడు కృష్ణారావు మోసాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన వేడుకున్నాడు. తనకు కృష్ణారావు ఇవ్వాల్సిన డబ్బు రూ.15లక్షలు, నెలనెలా చెల్లించిన డబ్బు రూ.12 లక్షలు తన కుటుంబానికి ఇప్పించాలని కోరాడు. తన కుటుంబానికి అదే ఆస్తి అని చెప్పాడు. డబ్బి కృష్ణారావు మోసాన్ని మీతో చెప్పడానికి ప్రయత్నించానని, కానీ పరిస్థితి అనుకూలించక చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. వడ్డీవ్యాపారి డబ్బి కృష్ణరావు మాజీ కౌన్సిలర్‌కాగా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనుచరుడిగా పేరుంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)