Breaking News

న్యాయవాదులకు ఏపీ బార్‌ కౌన్సిల్‌ అండ

Published on Mon, 09/29/2025 - 05:33

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ (న్యాయవాద మండలి), తాజాగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎన్‌.ద్వారకనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  

కీలక నిర్ణయాలు ఇలా.. 
⇒ మరణించిన న్యాయవాదుల నామినీలకు ప్రస్తుతం ఇస్తున్న మరణ ప్రయోజనం రూ. 3 లక్షలు పెరిగింది. దీనితో ఈ మొత్తం రూ.ఆరు లక్షల నుంచి రూ. తొమ్మిది లక్షలకు చేరింది.   
⇒ అనారోగ్యంతో బాధపడే న్యాయవాదులు, వారి భార్యలకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.1.50 లక్షలు. 

⇒ కాగా, ద్వారకనాథరెడ్డి నేతృత్వంలో జరిగిన న్యాయవాదుల క్లర్కుల సంక్షేమ నిధి కమిటీ సమావేశం మరణించిన న్యాయవాదుల క్లర్కు నామినీకి ప్రస్తుతం అందచేస్తున్న ఆర్థిక సాయా­న్ని రూ.4.50 లక్షలకు పెంచింది.  ప్రస్తుతం ఈ మొత్తం రూ. 4 లక్షలు. 
⇒ అనారోగ్యం బారిన పడిన క్లర్కులకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం రూ. 80 వేల నుంచి రూ.లక్షకు పెరిగింది.   

సంక్షేమానికి కౌన్సిల్‌ పెద్దపీట 
న్యాయవాదుల సంక్షేమానికి కౌన్సిల్‌ పెద్దపీట వే­స్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న (85 మందికి రూ.74.20 లక్షలు), వృత్తి నుంచి వైదొలగిన న్యాయవాదులకు (ముగ్గురికి రూ.9 లక్షలు)  మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు (52 మందికి రూ.2.86కోట్లు) బార్‌ కౌన్సిల్‌ మొత్తంగా  రూ.­3.69 కోట్ల ఆర్థికసాయం చేసింది.  దీనికి అదనంగా న్యాయవాదులందరి సంక్షేమం కోసం కౌన్సిల్‌ రూ.­20.50 లక్షల మేర ఆర్థిక సాయం అందజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ న్యాయ­వాది కుటుంబానికి రూ.5 లక్షలను న్యాయవాద మండలి నిధు­ల నుంచి చెల్లిస్తుండగా,  రాష్ట్ర ప్రభు­త్వం నుంచి రూ.4 లక్షలు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా అందుతోంది.  

ఐలూ హర్షం 
రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలపై ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు బార్‌ కౌన్సిల్‌కు ఐలూ రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమార్, ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు కృత­జ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభు­త్వం చెల్లించాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ మొత్తాన్నీ రూ.9 లక్షలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.    

దేశంలో ఎక్కడా లేని సంక్షేమం 
దేశంలో ఏ బార్‌ కౌన్సిల్‌ కూడా ఇంత పెద్ద మొత్తంలో న్యాయవాదులకు, వారి క్లర్కులకు ఆర్థిక సాయం అందించడం లేదు. న్యాయ­వాదుల సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. – ఎన్‌.ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)