Breaking News

24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Published on Tue, 02/11/2025 - 04:47

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌(Legislative Assembly budget) సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 28న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోజు వీలుకాని పక్షంలో వచ్చే నెల 3వ తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

మూడు వారాల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వీటి ప్రారంభానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు స్పీకర్‌ అయ్యన్న­పాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ­కృష్ణరాజు సోమవారం ఢిల్లీ వెళ్లారు. శిక్షణా తరగతులకు వచ్చేందుకు ఓం బిర్లా అంగీ­కరించినట్లు వారు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంక­య్యనాయుడిని ఆహ్వానించినట్లు చెప్పారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)