Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోతే!

Published on Tue, 11/12/2024 - 05:19

సాక్షి, అమరావతి:  పేద విద్యార్థుల ఉన్నత విద్యకు టీడీపీ కూటమి సర్కారు మోకాలడ్డుతోంది.  ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ మెయింటనెన్స్‌ చార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. దీంతో సుమారు ఏటా 12 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏటా పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) కోసం సుమారు రూ.2,700 కోట్ల నుంచి రూ.2,800 కోట్లు వ్యయమవుతుంది. ఇందులో హాస్టల్‌ విద్యార్థులకు మెయింటెనెన్స్‌ చార్జీల కింద సుమారు రూ.1,100 కోట్లు వెచ్చించాలి. 

కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన ఐదునెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విద్యార్థులకు తీవ్ర నిరాశను మిగిలి్చంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.1,766.77 కోట్లు, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌íÙప్‌ (మెయింటెనెన్స్‌–ఎంటీఎఫ్‌) కింద రూ.776.18 కోట్లు కలిపి మొత్తం రూ.2,542.95 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటానే 75 శాతంగా ఉంటోంది. దీనితో పాటు ప్రధానమంత్రి యశస్వీ పథకం కింద మరో రూ.356 కోట్లను కూడా పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌íÙప్స్‌ కేటాయింపుల్లో కలిపేసింది.  

ఇక ఆ చెల్లింపులు ప్రశ్నార్థకమే.. 
ఇక గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్‌ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలను ప్రభుత్వం నిలిపివేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఖర్చులు కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు ఆపేసింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్‌ చార్జీలు కలుపుకుని రూ.2,500 కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్‌ అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)