Breaking News

‘ఉపాధి’లో మళ్లీ ఏపీనే టాప్‌

Published on Mon, 05/22/2023 - 04:16

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తిగా ఆగిపోయే వేసవి కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో  ఆంధ్రప్రదేశ్‌ ఈ ఏడాది కూడా మొదటి  స్థానంలో నిలిచింది. పనులు దొరకక పేదలు నగరాలకు వలస పోయే దుస్థితి లేకుండా సొంత ఊళ్లలోనే వారికి పనులు కలి్పంచడంలో ఏపీ ఏటా ముందుంటోంది.

ప్రత్యేకించి వేసవి రోజుల్లో ఉపాధి పనుల కల్పనలో గత నాలుగేళ్లగా మన రాష్ట్రమే దేశంలో తొలి స్థానంలో నిలుస్తోంది. ఈ వేసవిలో కూడా ఏప్రిల్‌ 1 నుంచి శనివారం (మే 20) వరకు 6.83 కోట్ల పనిదినాల పాటు రాష్ట్ర ప్రభు­త్వం పనులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 99 శాతం గ్రామ పంచాయతీలు అంటే.. 13,132 గ్రామ పంచాయతీల్లో కేవ­లం 50 రోజుల్లోనే మొత్తం 31.70 లక్షల కుటు­ంబాలకు పని దొరికింది.

ప్రభుత్వం  కల్పి­ంచిన పనులతో ఈ కుటుంబాలు రూ.1,657.58 కోట్ల మేర లబ్ధి పొందడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు 50 రోజుల కాలంలో 5.20కోట్ల పనిదినాలపాటు పను­లు కలి్పంచింది. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి.

ఒక్కొక్కరికి రోజుకు రూ.245 
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఈ ఏడాది అధిక మొత్తంలో కూలి సైతం గిట్టుబాటు అయ్యింది. ఈ 50 రోజుల్లో కూలీలకు సరాసరిన రోజుకు రూ.245 చొప్పున కూలి లభించింది. మరోవైపు ఈ పనులకు 60 శాతానికి పైగా మహిళలే హాజరై ఉపాధి పొందారు. అలాగే మొత్తం 6.83 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పొందిన వారిలోనూ దాదాపు 32% మేర ఎస్సీ, ఎస్టీలే ఉ­న్నారని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)